కాటారంలో నూతన అవోపా ఏర్పాటు సమావేశము

 

తేదీ 24-10-2021 ఆదివారం రోజున కాటారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కాటారం మండలంలోని  అఫిషియల్స్  మరియు ప్రొఫెషనల్స్ అవోపా రాష్ట్ర కార్యదర్శి పెద్ది ఆంజనేయులు గారి అధ్యక్షతన ప్రారంభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. మొదట అవోపా రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ గారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిచయ కార్యక్రమం జరిగింది. 

అనంతరం మండలంలో యున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రొఫెషనల్ అనగా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, జర్నలిస్టులు, యల్.ఐ.సి ఏజెంట్ లు మొదలగు ప్రొఫెషనర్లు అందరూ సభ్యత్వం తీసుకునేందుకు నిర్ణయించడమైనది. ఒక్కొక్కరికి రూ 500 సభ్యత్వం ఫీజు చెల్లించాలని, వచ్చే వారం అందరి సమక్షంలో అవోపా మండల కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు నిర్ణయించడమైనది. ఈ లోగా అందరూ తమ సభ్యత్వం తీసుకోవాలిని వచ్చే సమావేశానికి సభ్యులందరూ హాజరు కావలసిందిగా కోరడమైనది. 

ఈ కార్యక్రమంలో అవోపా రాష్ట్ర కార్యదర్శి పెద్ది ఆంజనేయులు మాట్లాడుతూ అవోపా అనేది మేధావుల సంస్థ అని ఇందులో అటెండర్ నుండి ఐఏఎస్ అధికారుల, వరకు సభ్యులు ఉన్నారని  అన్ని శాఖలలో ఎవరో ఒకరు మనవాల్లు ఉంటారని ఏదైనా అవసరాలకు సహకారం అందిస్తారని తెలిపారు. అలాగే పేద వైశ్య విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం, ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతున్నదని  తెలిపారు. అతి త్వరలో కాటారంలో నూతన అవోపా కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో, దారం వెంకటేశ్వర్లు, మద్ది మూర్తి, అల్లాడి చందు, పుల్లూరు నాగేశ్వరరావు, ఆర్. అశోక్, ఏ.ప్రవీణ్ కుమార్, డాక్టర్ పి. సదాశివుడు, తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు