అవోపా బ్యాంక్మాన్ చాపుటర్ వారి కృష్ణ జన్మాష్టమి వేడుకలు


శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా తేదీ 31.08.21 సాయంత్రం గం.6.00లకు జూమ్ ద్వారా జరిగిన శ్రీ కృష్ణ వేషధారణ పాటల పోటీలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ సాధన నర్సింహాచార్యులు గారు  ప్రముఖ తెలుగు కవి పండితులు  సాహితీవేత్త శ్రీ కృష్ణ తత్వమును మరియు పిల్లలకు చిన్నప్పటినుండే  రోజూ పద్యము పాటలను వాళ్ళచేత పాడించాలని  తమ సందేశములో తెలిపారు. ముఖ్య అతిథి శ్రీ సాధన నర్సింహాచార్యుల వారిని శాలువతో మరియు పుష్ప గుచ్ఛంతో  సత్కరించారు. ఈ కార్యక్రమంలో 43 మంది 2 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసు గల చిన్నారులు ఇరు తెలుగు రాష్ట్రాలు మరియు ఢిల్లీ చెన్నై బెంగళూరు పట్టణాల నుండిపాల్గొని రాధా కృష్ణుల వేషధారణతో శ్లోకాలు పాటలు పాడి నృత్యములతో అందరిని అలరింప జేసారు. ఈ కార్యక్రమం సంధానకర్తగా సంస్థ కార్యవర్గ సభ్యురాలు బి మణిమాల గారు వ్యవహరించారు. మొట్టమొదట శ్రీమతి నళినీ మురళీకృష్ణగారు మహిళా విభాగం కార్యదర్శి  ప్రార్థన గీతం పాడారు. ప్రారంభోపన్యాసం శ్రీ పి వి రమణయ్య అద్యక్షులు అవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ హైదరాబాద్ వారు అందరికి స్వాగతం పలికారు మరియు బ్యాంక్ మెన్ చాప్టర్ చేయుచున్న సేవాకార్యక్రమాలను వివరించారు. ముఖ్య అతిథి శ్రీ సాధన నర్సింహాచార్యుల గారి ఉపన్యాసం మరియు సందేశము తర్వాత అందరు చిన్నారులు వారి వారి వేషధారణలను పాడిన పాటలు శ్లోకాలు నృత్యాలకు న్యాయనిర్ణేతలుగ శ్రీ రామానందం గారు హైదరాబాద్ మరియు శ్రీ టి యల్ వీ రావు గారు కెనడా నుండి వ్యవహరించినారు. అద్యక్షులు పి వి రమణయ్య గారు ఈ క్రింది చిన్నారులను విజేతలుగావారికి చిన్న నగదు మొత్తాలతో ప్రకటించారు. 

1. గోపిక ప్రథమ విజేతగా రూ. 516 

2. వి యస్ మణి హాసిని ద్వితీయ విజేతగా రూ. 316

3. గీతా సుహాని మువ్వల తృతీయ విజేతగా రూ.216 మరో నలుగురిని ప్రోత్సాహక బహుమతి ఒక్కొక్కరికి రూ.116 చొప్పున

1.యస్ మయూర్

2.యం వి చందన 

3.డి యన్ వి ఆర్ శ్రీ వంశిక

4. రేయాన్ష్ రామ్

 ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగగా,  చివరగా సంస్థ కార్యదర్శి శ్రీ గర్రే మురళీ కృష్ణ గారు వందన సమర్పణ చేశారు. హాజరైన వారందరిలో హర్షం పెల్లుబికింది.



కామెంట్‌లు