ఇంజినిర్లకు సన్మానం
ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జగిత్యాల పట్టణ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే ను పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ గోలి శివ హర్షిత్, జవ్వాజి సాయి స్మరణ్ , శ్రీ కోట భార్గవ్ గార్లను ఘనంగా శాలువా మరియు మెమొంటో తో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ ఆవోపా అధ్యక్షుడు శ్రీ పబ్బ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ జాతి నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర ముఖ్యమైనదని మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నవీకరణ పద్ధతులతో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆధునిక పారిశ్రామిక పద్ధతులను అన్వహిస్తూ దేశ అభ్యున్నతి లో భాగస్వామ్యం వహిస్తున్న ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. ప్రతి సంవత్సరం సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 15వ తేదీన ఇంజనీర్స్ డే జరుపుతామని దీనిలో భాగంగా జగిత్యాల పట్టణంలో కరోనా క్లిష్ట సమయంలో కూడా పట్టణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విశిష్ట సేవలు అందించిన ఇంజనీర్స్ వారి సేవలను గుర్తించి జగిత్యాల పక్షాన ఘనంగా సన్మానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అవోపా జిల్లా అధ్యక్షులు శ్రీ రాజేశునిశ్రీనివాస్ గారు మరియు పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీ మోటూరి శ్రీనివాస్ గారు కోశాధికారి శ్రీ వూటురి నవీన్ గారు శీల శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి