తెలంగాణ రాష్ట్ర అవోపా స్టేట్ కౌన్సిల్ సమావేశము

 


తెలంగాణ రాష్ట్ర అవోపా స్టేట్ కౌన్సిల్ మీటింగ్ 12.9.2021 రోజున ఉదయం 11 గంటలకు ముషీరాబాద్ వైశ్య హాస్టల్ లోని గంజి రాజమౌళి గుప్త గారి సమావేశ మందిరంలో జరిగినది. ఈ సమావేశానికి సభ్యులు పెద్ద సంఖ్య లో హాజరైనారు. తొలుత వాసవీ మాత ప్రార్థనతో మొదలైన సమావేశము ఎజెండా ప్రకారం కొనసాగినది. ప్రధాన కార్యదర్శి తాము జరిపిన సంఘ కలపాలని వివరించారు. ఆర్థిక కార్యదర్శి ఆడిటెడ్ 2019-20 మరియు 2020-21 బాలన్స్ షీట్స్ ప్రవేశపెట్టగా ఆమోదించ నైనది. ఎన్నికల అధికారి 2.9.2021 రోజున ఎన్నికల కార్యక్రమ వివరాలు వివరించుతూ శ్రీ మలిపెద్ది శంకర్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లుగా ప్రకటించారు. శ్రీ గంజి స్వరాజ్యబాబు అధ్యక్షుడు నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ మలిపెద్ది శంకర్ గారికి ఛార్జ్ అప్పజెప్పారు. అధ్యక్ష స్థానామలంకరించిన శ్రీ మలిపెద్ది శంకర్ గారు ఎన్నికల అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ తనకు సహకరించుటకు ప్రధాన కార్యదర్శిగా శ్రీ పోలా శ్రీధర్ గారిని, అదనపు ప్రధాన కార్యదర్శిగా శ్రీ సిరిపురం శ్రీనివాస్ గారిని, శ్రీ నిజాం వెంకటేశం గారిని ఆర్థిక కార్యదర్శిగా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కందికొండ శ్రీనివాసులు గారిని, ప్రధాన సలహాదారునిగా శ్రీ పోకల చందర్ గారిని, సలహదారునిగా శ్రీ గంజి స్వరాజ్యబాబుని  నియమించినట్లు ప్రకటించారు. యువకులను ప్రోత్సహించుతూ,  సమర్థవంతముగా పనిచేయు యువకులను  మిగతా రీజినల్ చైర్మన్లుగా వివిధ కమిటీ సభ్యులుగా త్వరలో నియమించ నున్నట్లు తెలియజేశారు. వారిని అవోపా బులెటిన్ సంపాదకవర్గం, సంపాదకులు నూక యాదగిరి గారు  సభకు హాజరైన యూనిట్ అవోపా నాయకులు ఘనంగా సన్మానించారు. మధ్యాహ్న భోజనానంతరము శ్రీ మలిపెద్ది గారు వివిధ సీనియర్ నాయకులతో రాష్ట్ర అవోపా అభ్యున్నతికి తీసుకోవలసిన చర్యలగురించి చర్చించారు. తదుపరి వోట్ ఆఫ్ థాంక్స్ తో సమావేశం ముగిసినది. 

కామెంట్‌లు