అవోపా హైదరాబాద్ వారి స్వతంత్ర దినోత్సవ వేడుకలు

 

ఈరోజు15.08.2021 అవోపా హైదరాబాద్ కార్యాలయంలో 75వ  స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ సందర్భంగా గౌరవనీయులు శ్రీ ఆర్ ఎస్ వి బద్రినాథ్, రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్, OSD (ప్రోటోకాల్) తెలంగాణ గవర్నమెంట్  వారు ముఖ్య అతిథిగా విచ్చేసి  ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా వందనం కావించారు. తదుపరి వాసవి మాత ప్రార్ధన చేయడం, తదుపరి కార్యక్రమం ప్రారంభించడం జరిగినది . అధ్యక్షులు రేణికుంట నమశ్శివాయ గారు ప్రసంగిస్తూ మా కమిటీ వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేయడం జరిగినది మేము ఎన్నికల ప్రణాళిక లలో ప్రకటించిన విధంగా బిల్డింగ్ కోసం ప్రయత్నం జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు  ఉన్న కార్యాలయము దాదాపు 40 నుంచి 45 సంవత్సరములు అయినది కావున కొత్త భవనము  తీసుకుంటే బాగుంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ సహకరిస్తే మనము ఒక కొత్త భవనం తీసుకోవచ్చును అని అన్నారు. తర్వాత Vyspro అవోపా కు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి శంక నారాయణ మూర్తి Vyspro  గారు ప్రసంగిస్తూ Avopa Hyderabad & Vyspro   సంస్థలు పరస్పరం సహకరించుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నాయి అని అన్నారు. ఈ బిల్డింగ్ కమిటీ లో కూడా మా భాగస్వామ్యం ఉంటుంది అని అన్నారు. తదుపరి ముఖ్య అతిథి ఆర్ ఎస్ సి బద్రీనాథ్ గారు ప్రసంగిస్తూ అవోపా హైదరాబాద్ అధ్యక్షులు నమశ్శివాయ గారు ఒక ప్రత్యేకత ఏర్పరచుకొని తనదైన శైలిలో కార్యక్రమాలు చేస్తున్నారని వారిని, ప్రస్తుత కమిటీని వారు అభినందించారు తరువాత కీర్తిశేషులు కిషోర్ గారి కుమారునికి ల్యాప్టాప్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో లో కొశాదికారి మాకం బద్రీనాథ్, ఉపాద్యక్షులు బైసాని సత్యనారాయణ , సంయుక్త కార్యదర్శి బచ్చు శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తదుపరి వందన  సమర్పణతో ఈ కార్యక్రమాన్ని ముగించటం జరిగినది.

కామెంట్‌లు