నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ శివాలయంలో సోమవారం ఆవోపా ఆధ్వర్యంలో బాసరలో త్రిబుల్ ఐటీ ద్వితీయ సం వత్సరం చదువుతున్న సాతాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని వైష్ణవికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా అవోపా జిల్లా అధ్యక్షులు బిళ్లకంటి రవి కుమార్ మాట్లాడుతూ పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఆర్యవైశ్య సభ్యులు, దాతల సహ కారంతో ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వాస రాఘవేందర్, ఇందువాసి రవి ప్రకాష్, శ్రీకాంత్, బొడ్డు పాండు, దర్శి రాజయ్య, సుధాకర్, కె పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి