ఉద్యోగ పరంగా తీరిక లేకపోయినా సమాజ సంక్షేమానికి, అవోపా సంఘ శ్రేయస్సుకు తన వంతు సేవలందిస్తూ అనేక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ, అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ అవోప కార్యదర్శి శ్రీ బైసాని నాగ వెంకట సత్యనారాయణ గుప్తా గారు 30-06-2021 న ఉద్యోగరీత్యా "కొటక్ మహీంద్రా బ్యాంక్" నుండి రిటైర్ అయినారు. వారు వైశ్య బ్యాంక్ లో ఉద్యోగ ప్రవేశం చేసి, వైశ్యా బ్యాంక్ ఐ.ఎన్.జి వైశ్యా బ్యాంక్ లో విలీనమైన పిదప బ్యాంక్ తరఫున ఇతర దేశములకు వెళ్లి బ్యాంకింగ్ వ్యవస్థను అధ్యయనం చేసినారు. వీరు పదవి విరమణ చేసిన సందర్భంలో తెలంగాణ స్టేట్ అవోపా అధ్యక్షులు శ్రీ గంజి స్వరాజ్ బాబు, ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, ఆర్థిక కార్యదర్శి శ్రీ చింతా బాలయ్య, ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్, చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ గుండా చంద్రమౌళి, హైదరాబాద్ అవోపా అధ్యక్షులు శ్రీ ఆర్. నమఃశ్శివాయ, ప్రధాన కార్యదర్శి శ్రీ రవి గుప్తా, అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూక యాదగిరి గారలు మరియు శ్రీ బిగినేపల్లి చక్రపాణి, శ్రీ కూర చిదంబరం తదితరులు వీరికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ పదవీ విరమణ చేసిన బైసాని గారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా గడవాలని, భవిష్యత్తులో వీరు మరిన్ని అవోపా సేవా కార్యక్రమాలలో పాల్గొని తన వంతు సేవలందించాలని అభిలషిస్తున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి