అవోపా సూర్యాపేట వారు నిర్వహించిన కోవిడ్ వాక్సినేషన్ క్యాంపు

 


తేదీ 12.6.2021 రోజున అవోపా సూర్యాపేట ఆధ్వర్యంలో కోవిడ్ వాక్సినేషన్ టీకా ఇచ్ఛు కార్యక్రమం జరిగినది.  ఈ కార్యక్రమము తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు యశోదా హాస్పిటల్స్ మలక్ పేట సౌజన్యంతో ఏర్పాటు చేయనైనది. సుమారు 71 మంది సూర్యాపేట మరియు చుట్టు ప్రక్క గ్రామాల నుండి విచ్ఛేసి టీకా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షుడు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు శ్రీ ఉప్పల సంపత్ కుమార్ గారు అతని అవోపా సహచరులు స్థానిక వైశ్య ప్రముఖులు హాజరైనారు. ప్రజాపయోగ కార్యక్రమము చేపట్టిన అవోపా సూర్యాపేట వారిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి.
కామెంట్‌లు