అవోపా మిర్యాలగూడ వారిచే విద్యార్థిని కి ఆర్థిక సహాయము

 

తేదీ 5.6.2021 రోజున అవోపా మిర్యాలగూడ వారు ఏం.బి.బి.ఎస్ 5వ సెమిస్టర్ చదువుచున్న విడియాల ప్రసన్న లక్ష్మీ ఆర్థిక ఇబ్బందులతో చదువుకొనసాగించలేక పోవు చున్న సందర్భంలో అవోపా మిర్యాలగూడ వారు 10 మంది దాతల వద్ద డోనేషన్స్ తీసుకుని ఆమె చదువు కొనసాగించుటకు రూ.1,00,000 ఒక లక్ష రూపాయలు ఎస్.బి.ఐ చెక్కు ద్వారా ఆర్థిక సహాయము చేశారు. ఈ కార్యక్రమములో అవోపా మిర్యాలగూడ అధ్యక్షులు మురహరి గారు కార్యదర్శి జనార్దన్ గారు, స్థానిక వైశ్య సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవోపా మిర్యాలగూడ వారికి మరియు ఆర్థిక సహాయము చేసిన దాతలకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తేలియజేయు చున్నవి. 

కామెంట్‌లు