అవోపా బ్యాంక్మన్ చాపుటర్ వారి అంతర్జాతీయ మాత్రుదినోత్సవం

 


అవోపా బ్యాంక్మన్ చాపుటర్ వారు  అంతర్జాతీయ మాత్రు దినోత్సవాన్ని తేదీ 9.5.2021 రోజున వర్చువల్ గా  చాలా ఆర్భాటంగా జరుపుకున్నారు. శ్రీ పి.వి.రమణయ్య గారు ఆహుతులను ఆహ్వానించి అమ్మ పండుగను ఆహ్వానిస్తూ గానం చేశారు. శ్రీ పూర్ణచందర్ రావు గారు సందానకర్తగా మాతృ వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఐదుగురు మాతృమూర్తులను వారి కుమారులు, కుమార్తెలు వారి ఇంటి వద్దే సన్మానించారు. కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందని పలువురు హర్షాతిరేకాలతో నిర్వాహకులను అభినందించారు.  ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శ్రీ పి.వి.రమణయ్య గారు, శ్రీ గొర్రె మురళీకృష్ణ గారు, శ్రీ.కె.వి.ఎస్ గుప్త గారు తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు