నేటి రాశి ఫలాలు

 


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 


*_27, ఏప్రియల్ , 2021_*

*_స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్_*  

*_చైత్రమాసము_*

*_వసంత ఋతువు_*

*_ఉత్తరాయణము_*               *_భౌమ వాసరే_*

*_( మంగళ వారం )_*


*_శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్_*

_అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹_

_అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹_


*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

 యశోవృద్ధి ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సుసౌఖ్యం, ధైర్యం, శరీరబలం, కీర్తి, భోజన సౌఖ్యం లభిస్తాయి. *_శ్రీ విష్ణు ఆరాధన చేయడం మంచిది_*.

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. అర్థలాభం ఉంది. కీలక విషయాల్లో సొంతనిర్ణయాలు లాభాన్నిస్తాయి. అభివృద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. *_హనుమాన్ చాలీసా చదవడం మంచిది._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

చేపట్టిన పనులు పూర్తవుతాయి. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా పెద్దగా ఇబ్బందిపెట్టవు. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభం అవుతాయి. కుటుంబ సహకారం ఉంటుంది. *_ఇష్టదైవారాధన శుభప్రదం_*.

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_* 

శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. ఆరోగ్యమే మహా భాగ్యం అని మరువకండి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

శుభసమయం. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. దైవారాధనను *_ఎలాంటి పరిస్థితులలోనూ మానవద్దు_*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకోవాలి. చేపట్టే పనుల్లో  శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగాఉండాలి. ఆర్థిక నియంత్రణ అవసరం. *_విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా  పూర్తిచేయగలుగుతారు. శారీరక శ్రమ పెరిగినా అందుకు తగిన ఫలితాలు లభించడం వలన సంతోషంగా ఉంటారు. మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించండి. *_దుర్గాస్తుతి పఠించాలి._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

గొప్ప ఆలోచనలతో పనులను ప్రారంభిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు లాభాన్నిస్తాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. *_శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

మనస్సౌఖ్యం ఉంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. *_దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది._*

🏹🏹🏹🏹🏹🏹🏹 


🐊 *_మకరం_*

మంచి కాలం. ఏపని మొదలు పెట్టినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. *_ఇష్టదైవ ప్రార్ధన మరింత మేలు చేస్తుంది._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

 పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. *_ఆదిత్యహృదయం పఠించాలి._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

సుఖ సౌఖ్యాలున్నాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ఆర్థిక యోగం శుభప్రదం. *_సూర్య ఆరాధన శుభదాయకం._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు