“ఉప్పు” చెప్పెను గొప్పగా ,నేను లేకుంటె నీకు ముప్పు తప్పదని, “కారం” మమకారమై ,తన సహకారమందించగా, “చేదు” తను వేద నాదమై ,ఈతి బాధలు తొలగించగా, “వగరు” తన పొగరుతో, సాగర కెరటమై పరవళ్ళు తొక్కగా, “పులుపు” తన వలపు చూపులతో గెలుపునే కోరగా “తియ్యదనం” కయ్యమును వీడి నెయ్యముతో సయ్యాటలాడగా ముచ్చటపడి ఉగాది పచ్చడి మచ్చికతో అచ్చెరువొందించెను సుమా!!! “కరోనా” తాకిడికి శార్వరి నామం భారీ మూల్యంతో పలాయనం చిత్తగించగా, విప్లవ ధీమాతో పయనమై వాలింది “ప్లవ”నామం” చక్కనైన మాట చంద్ర నోట.
రచన: మీ పోకల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి