పోకల పలుకులు

 


పోకల పలుకులు

“గోటితో పోయేదాన్ని,

గొడ్డలి వరకు తెచ్చుకోవడం 

గౌరవనీయమా ?


మాస్కుతో పోయేదాన్ని,

మరణం వరకు తెచ్చుకోవడం 

మాననీయమా ?

శానిటైజెర్ తో పోయేదాన్ని,

శ్మశానం వరకు తెచ్చుకోవడం 

శ్లాఘనీయమా ?

భౌతికదూరంతో పోయేదానికి,

భారీమూల్యం భావ్యమా?

పండుగ చేసుకోపోతే 

కొంపమునగలేదు,కాని,

కరోనా కంటబడితే మాత్రం 

కాటికిపోవడం తధ్యం.

పబ్బుకువెళ్లకపోతే 

ఫరవా లేదు కాని,

వైరస్ వెంటబడితే మాత్రం 

విగతజీవికావడం ఖాయం.

సినిమాకు వెళ్లకపోతే  

నష్టమేమీ లేదు కాని,

మహమ్మారి ముద్దెడితే మాత్రం 

మరణశయ్యనెక్కడం నిశ్చయం.

అవసరంకాని  అంశాలకు 

అధిక ప్రాధాన్యమిచ్చి,

అనారోగ్యం కొనితెచ్చుకుని 

అష్టకష్టాలు పడడం  

అభిలషణీయమా?ఆలోచించండి.”


pokala mantra

“À *Positive Person* Gives  "RESULTS", whereas  A   Negative Person Gives "REASONS" GM .**

కామెంట్‌లు