ఈ వారం రాశి ఫలాలు

 

వారఫలాలు. 

By Dr KUMAR, PhD

Astrologer & Numerologist

-----------------------------------------------

28th MAR 2021 నుండి 03rd APR 2021 వరకు

గమనిక

------------

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టిలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.


మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.


పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు,


మేషరాశి

------------

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి:-

ఈ వారం వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. పారిశ్రామికవేత్తలకు శ్రమ తప్పకపోవచ్చు. ధన, వస్తులాభాలు. ఉద్యోగావకాశాలు నిదానిస్తాయి. అనుకున్న వ్యవహారాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు.


వృషభరాశి

---------------

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి:-

ఈ వారం ఉద్యోగాలలో మీ హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. పట్టుదలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. అత్యంత కీలకమైన ఒక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరించి లాభాలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి.


మిధునరాశి 

----------------

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది.  వ్యతిరేక పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. గతం నుంచి ఎదురైన సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 


కర్కాటకరాశి

------------------

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి:-

ఈ వారం వ్యూహాత్మకంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. మిమ్మల్ని వ్యతిరేకించే వారిని సైతం ఆకట్టుకుని, వారి ప్రేమాభిమానాలు పొందుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఆహ్వానాలు రాగలవు.  స్థిరాస్తిపై కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు పైస్థాయి నుంచి పిలుపు రావచ్చు. 


సింహరాశి 

--------------

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి:-

ఈ వారం నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులను కలుసుకుని కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. మనస్సులోని చిరకాల కోరిక నెరవేరుతుంది. ఎంతటి సమస్య ఎదురైనా పట్టుదలతో అధిమిస్తారు. సంఘంలో అందరి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో హోదాలు, గౌరవం పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు లభించవచ్చు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. 


కన్యారాశి

-------------

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి:-

ఈ వారం వ్యాపారాలలో అడుగుముందుకు వేస్తారు. పెట్టుబడులు సమకూరే సమయం. ఉద్యోగాలలో చిక్కులు, ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు కొన్ని నెరవేరతాయి. పరిస్థితులను క్రమేపీ మార్చుకుంటారు. సోదరులు, మిత్రుల సహాయంతో కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మిక వేత్తలను కలుసుకుని మనశ్శాంతి పొందుతారు. ఆస్తుల విషయంలో నెలకొన్న వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాల నిర్వహణపై కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. 


తులారాశి

-------------

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం అనుకున్న లక్ష్యాలు సాధించేదిశగా ముందడుగు వేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తొలగుతాయి. పారిశ్రామికరంగాల వారి ప్రయత్నాలలో కదలికలు కనిపిస్తాయి. ఆర్థికంగా బలోపేతమవుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. 


వృశ్చికరాశి

---------------

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి:-

ఈ వారం మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. పాతబాకీలు కూడా వసూలవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. 


ధనుస్సురాశి

-----------------

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి:-

ఈ వారం కొత్త పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కొన్ని విజయాలు సొంతం చేసుకుంటారు. ఆప్తులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాలబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు. రాజకీయవర్గాలకు పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది. 


మకరరాశి

--------------

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి:-

ఈ వారం కీర్తిప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఊహించని రీతిలో ధనప్రాప్తి కలుగుతుంది. విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. ఉద్యోగాలలో కొన్ని హోదాలు దక్కవచ్చు. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. 


కుంభరాశి

--------------

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి:-

ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. బంధువులతో తగాదాలు క్రమేపీ తొలగుతాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు, ఒడిదుడుకులు తొలగుతాయి. 


మీనరాశి

-------------

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి:-

ఈ వారం ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. ఆర్థిక పరిస్థితి అనుకూలించి రుణబాధలు తొలగుతాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి.


గమనిక

---------------

మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి

కామెంట్‌లు