నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_01, మార్చి , 2021_*                 *_ఇందు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ఈరోజు

చేపట్టిన పనులను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. *_మనోబలం పెరగానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి._* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

ఈరోజు 

మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తోటివారి ద్వారా సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి.  *_వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ఈరోజు

మనోధైర్యంతో చేసే పనులు చక్కటి విజయాన్నిస్తాయి. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందు,  వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. *_దైవారాదన మానవద్దు. శివారాధన శుభప్రదం._* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

ఈరోజు

విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సుఖసంతోషాలతో కాలం గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. *_దైవబలం అనుకూలిస్తోంది. శివారాధన మేలు చేస్తుంది_* ..  

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఈరోజు

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. అవసరానికి తగిన ధనం చేతికి అందుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. *_ఈశ్వర ధ్యాన శ్లోకం చదివితే మంచిది._*  

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

ఈరోజు 

కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. *_దైవారాధన మానవద్దు._* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

ఈరోజు

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. *_శివ స్తోత్రం పఠిస్తే మంచిది_* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఈరోజు 

వృత్తిపరంగా అనుకూలత ఉంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. *_ఇష్టదైవారాధన శుభానిస్తుంది._* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

ఈరోజు

అనుకూల ఫలితాలున్నాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. *_ఆదిత్య హృదయం పఠించాలి._*   

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

ఈరోజు

మధ్యమ ఫలితాలున్నాయి. పనులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. *_దుర్గారాధన శుభప్రదం._*    

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

ఈరోజు

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఇష్టులతో మరపురాని క్షణాలను గడుపుతారు. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. *_ఆంజనేయ స్వామి ఆరాధన ఉత్తమం._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

ఈరోజు

శుభ ఫలితాలున్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాలను నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_శివుడిని ఆరాధిస్తే శుభదాయకం._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు