కుటీర్ ఆశ్రమ వాసులకు పండ్లు ఫలాలు

 


అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తేదీ  09-03.2021  రోజున తమ్మన ఛారిటబుల్ ట్రస్టు హైదరాబాద్ చైర్మన్ శ్రీధర్ గారు  మరియు వైస్ చైర్మన్ శ్రీమతి సుజాత గారు  కుటీర్ వృద్ధాశ్రమం మల్లాపూర్ ను దర్శించి ఆశ్రమ వాసులకు మరియు కార్మికులకు

మూడు రకాల పండ్లు మరియు స్త్రీలందరికి చీరలను పంచినారు. ఈ కార్యక్రమానికి శ్రీ గ్రంధి రమేష్ గారు  సమన్వయ కర్తగా వ్యవహరించారు. శ్రీ పి వి రమణయ్య గారు అధ్యక్షుడు బ్యాంక్ మెన్ చాప్టర్ మరియు కుటీర్ బోర్డు మెంబర్ అతిథులను శాలువతో సత్కరించారు. ఇట్టి కార్యక్రమానికి శ్రీ మోహన్ దాస్ రాయపూడి కార్యదర్శి కుటీర్, రమేష్ గ్రంధి ట్రస్టీ కుటీర్,  శ్రీ రామకృష్ణ హండే రూమ్ డోనార్ మరియు శ్రీ సూర్యనారాయణ మూర్తి మేనేజర్ కుటీర్ పాల్గొని తిలకించి అభినందించారు. ఈ మొత్తం కార్యక్రమం V మీడియాలో ప్రసారం చేయబడినదని నిర్వాహకులు తేలియజేయు చున్నారు. 


కామెంట్‌లు