ఈ వారం రాశి ఫలాలు

 


వారఫలాలు. 

By Dr KUMAR, PhD

Astrologer & Numerologist

-----------------------------------------------

07th MAR 2021 నుండి 13th MAR 2021 వరకు


 గమనిక

------------

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టిలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.


మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.


పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు,


మేషరాశి

-------------

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి:-

ఈ వారం వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు. రాజకీయ, కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాలపై నిర్ణయాలు. వాహనాలు, భూములు కొంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


వృషభరాశి 

----------------

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి:-

ఈ వారం వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని వేడుకలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.


మిధునరాశి 

----------------

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు పెట్టుబడులు పెరిగి పురోగతిలో సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు లభించవచ్చు. రాజకీయవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. 


కర్కాటకరాశి

------------------

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి:-

ఈ వారం వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. కళారంగం వారికి ఒత్తిడులు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కొంత చికాకు పెట్టవచ్చు. విద్యార్థులకు శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. 


సింహరాశి 

--------------

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి:-

ఈ వారం శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు పెరుగుతాయి.  ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. 


కన్యారాశి

-------------

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి:-

ఈ వారం శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. 


తులారాశి

--------------

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరతాయి. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. 


వృశ్చికరాశి

----------------

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: -

కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. 


ధనుస్సురాశి

------------------

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి:-

ఈ వారం పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్యవిషయాలు తెలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త భాగస్వాముల సహాయంతో వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు. 


మకరరాశి

---------------

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి:-

ఈ వారం పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగులకు నూతనోత్సాహం. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 27 ప్రదక్షిణలు చేయండి.


కుంభరాశి

--------------

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి:-

ఈ వారం వ్యాపారాలు ఊహించిన కంటే అధికంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. కళారంగం వారికి అనుకోని సంఘటనలు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారికి ఎర్రని పూలతో పూజించండి


మీనరాశి

-------------

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి:-

ఈ వారం పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు.  వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. సంఘంలో మీపై మరింత గౌరవం పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు అవకాశాలు అందివస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.


గమనిక

---------------

మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి

కామెంట్‌లు