ఈ వారం రాశి ఫలాలు

 

వారఫలాలు. 

By Dr KUMAR, PhD

Astrologer & Numerologist

-----------------------------------------------

21th MAR 2021 నుండి 27th MAR 2021 వరకు


గమనిక

------------

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టిలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.


మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.


పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు,


మేషరాశి

-------------

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ వారం నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు, విక్రయాలలో అవాంతరాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా పడతాయి. 


వృషభరాశి 

---------------

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :-

ఈ వారం కొన్ని ఆరోగ్య సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల నుంచి ఒత్తిడులు తగ్గుతాయి. మీలోని దానగుణం వెలుగులోకి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి.


మిధునరాశి 

----------------

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం కొత్త కాంట్రాక్టులు దక్కే అవకాశం. వాహనాలు, ఇళ్ల కొనుగోలులో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సమర్థత, సామర్థ్యం వెలుగులోకి వస్తాయి. పారిశ్రామికవేత్తలు పూర్వానుభవాలతో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. కొన్ని వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. 


కర్కాటకరాశి

-----------------

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి:-

ఈ వారం చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పెద్దల సలహాల మేరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. 


సింహరాశి 

--------------

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి:-

ఈ వారం ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. కళాకారులకు శుభవార్తలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు పెరుగుతాయి. ఆత్మీయులతో విభేదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. 


కన్యారాశి

-------------

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి:-

ఈ వారం శ్రమకు తగిన ఫలితం కనిపించదు. పనులు కొంత నిదానిస్తాయి. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖ వ్యక్తుల పరిచయాలు ఏర్పడవచ్చు. ఇంటి నిర్మాణయత్నాలు నిలిపివేస్తారు. ఆరోగ్యసమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు, రుణయత్నాలు సాగిస్తారు.  వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలను మధ్యలో విరమిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి.


తులారాశి

--------------

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం కుటుంబంలో మీపై ఆదరణ పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు, ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు నూతన అవకాశాలు దక్కుతాయి. వ్యూహాత్మక వైఖరితో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. నూతన పరిచయాలతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ మెరుగుపడతాయి. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు దక్కించుకునే వీలుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 


వృశ్చికరాశి

---------------

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి:-

ఈ వారం ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరే సమయం. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. 


ధనుస్సురాశి

-----------------

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి:-

ఈ వారం ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. పారిశ్రామికవేత్తల యత్నాలు సానుకూలమవుతాయి. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాభావంతో ముందుకు సాగి ప్రశంసలు పొందుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో అంది అవసరాలు తీరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సమయానికి విస్తరిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. 


మకరరాశి

--------------

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి:-

ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కళాకారులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తుల వివాదాలు నెలకొంటాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. 


కుంభరాశి

------------

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి:-

ఈ వారం ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు హోదాలు ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయవేత్తలకు విజయాలు వరిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. 


మీనరాశి

------------

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి:-

ఈ వారం కుటుంబానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవేత్తలు క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడతారు. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. సోదరులు, మిత్రులతో మనస్పర్థలు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. భూవివాదాలు పరిష్కారదశకు చేర తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. 



గమనిక

---------------

మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి

కామెంట్‌లు