కుటీర్ కు నిత్యావసర సరుకుల అందజేత

 

ఈ రోజు 5.3.2021 రోజున  పంఖుడీ వెల్ ఫేర్ అసోసియేషన్  అధ్యక్షురాలు శ్రీ మతి హినా కౌసర్, కార్యదర్శి పాయల్ మరియు వారి మిత్ర బృందం మల్లాపూర్ లోని అవోపా బ్యాంక్మన్ చాపుటర్ వారు నిర్వహిస్తున్న  కుటీర్ వృద్ధాశ్రమమును దర్శించినారు. అక్కడ నివాసముంటున్న 36 మంది వృద్ధులకు ఆపిల్ పండ్లు అరటి పండ్లు మరియు సంత్రా పండ్లు, 50కిలోల బియ్యం 10 కిలోలు కందిపప్పు 10కిలోల  మంచినూనె 25 కిలోల పంచదార తో పాటు మందులు  జింకోబైట్, పారసిటమాల్, బి కాంప్లెక్స్ మరియు మల్టీ విటమిన్ బిళ్లలు ఇస్తూ మంచి హృదయంతో వృద్ధుల యొక్క ఆరోగ్యం మరియు శ్రేయస్సు కాంక్షించడం జరిగింది. ఇంకనూ ఒక juicer మిక్సీ మరియు ఒక  ఐదు లీటర్ల వెట్ గ్రైండర్  కూడా వృద్ధాశ్రమంనకు బహూకరించినారు. ఈ సందర్భంగా  వీరందరినీ  కుటీర్ బోర్డు మెంబర్ మరియు బ్యాంక్ మెన్ చాప్టర్  అధ్యక్షుడు శ్రీ పి వి రమణయ్య గారు, కుటీర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ బైసాని సత్యనారాయణ గారు, శ్రీ రామకృష్ణ గారు కుటీర్ ఆశ్రమ వాసి మరియు శ్రీ సూర్యనారాయణ మూర్తి  కుటీర్ మేనేజర్ గారు  అతిథులకు కృతజ్ఞతలు చెప్పి వారికి కుటీర్ వృద్ధాశ్రమం గూర్చి వివరించారు. శ్రీమతి హినా కౌసర్ , పాయల్ మరియు వారి బృదం అక్కడి వ్యవస్థను మరియు ఏర్పాట్లు చూసి చాలా సంతోషం వెలిబుచ్చినారు. 

కామెంట్‌లు