నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు బిల్లకంటి రవికుమార్ పిలుపుమేరకు జిల్లాలోని అన్ని యూనిట్ అవోపా లలో కొత్తవారికి ముఖ్యంగా మహిళలకు అవోపా లైఫ్ మెంబర్షిప్ కార్యక్రమాన్ని నాగర్కర్నూల్ యూనిట్ అవోపా లో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మొదటగా శ్రీమతి వనజ బిల్ల కంటి రవి కుమార్ హెల్త్ అసిస్టెంట్, శ్రీమతి మహతి మెడికల్ ఆఫీసర్ ఆర్ బి ఎస్ కె శ్రీమతి సుజాత రజినీకాంత్ సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయురాలు గార్లకు మెంబర్ షిప్ ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు బిల్లకంటి రవి కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డు పాండు గారు, దర్శి రాజయ్య, ఆకారపు ఫణి కుమార్, కాసుల ప్రసాద్ సార్, టౌన్ అధ్యక్షులు వాసా రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి ఇందువాసి రవి ప్రకాష్, ఆర్థిక కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు సాయి శంకర్ లు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ నాగర్ కర్నూలు అచ్చంపేట కల్వకుర్తి కొల్లాపూర్ యూనిట్లలో మెంబర్షిప్ డ్రైవ్ ను చేపట్టాలని కోరారు, ముఖ్యంగా మహిళా సభ్యులకు లైఫ్ సభ్యత్వాలను ఇవ్వాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం లోనే ప్రథమంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన శ్రీ బిల్లకంటి రవికుమార్ గారిని వారి టీంను తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తూ మిగతా అన్ని అవొపాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుకోవాలని, వసూలైన అట్టి సభ్యత్వ రుసుమును కార్పస్ ఫండ్ క్రింద ఫిక్సడ్ డిపాసిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకోవాలని ఉద్బోధించు చున్నారు.
నాగర్ కర్నూల్ వారి సభ్యత్వ నమోదు కార్యక్రమం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి