నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_07, ఫిబ్రవరి , 2021_*                 *_భాను వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

చేపట్టే పనుల్లో ఆటంకాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. మొహమాటంతో డబ్బులు ఖర్చు చేయకండి. బంధుమిత్రులతో మాట పట్టింపులకు పోరాదు. చెడు స్నేహాలు చేయవద్దు. *_విష్ణు నామాన్ని స్మరించాలి_*  

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

ఇష్టకార్య సిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకున్నది సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. *_శివుడిని ఆరాధిస్తే మంచిది_* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఒత్తిడిని అధిగమిస్తారు.  కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. *_శివారాధన శక్తినిస్తుంది_*  

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

చేపట్టే పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. హుషారుగా పనిచేయాలి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. *_సూర్యాష్టకం చదివితే మంచిది._* 

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలు ఉన్నాయి. ఉత్సాహంగా పనిచేయండి. మంచి ఫలితాలను సాధిస్తారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. *_శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం_* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవ్వరితోనూ వాగ్వాదం చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. *_లక్ష్మీ ధ్యానం శుభప్రదం_* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

ఉద్యోగ, వ్యాపారాల్లో  శ్రద్ధగా పనిచేయాలి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. *_లక్ష్మి అష్టకాన్ని చదవాలి._* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఉత్తమ కాలం. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. బుద్ధిబలంతో కీలక సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. జన్మస్థానంలో చంద్ర బలం అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం కలదు. *_శని ధ్యాన శ్లోకం చదివితే మంచిది._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలున్నాయి. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం_* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

మీ మీ రంగాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. *_శివ ఆరాధన శుభదాయకం_*.

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా తోటి వారి సాయంతో వాటిని అధిగమిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో  పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. *_ఇష్టదైవారాధన ఉత్తమం._*  

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

చేపట్టిన పనుల్లో విజయావకాశాలు ఉన్నాయి. ఆశించిన ఫలితం లభిస్తుంది. ఒక వ్యవహారంలో తగిన సాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది.  దైవబలం ఉంది. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు