ఈ వారం రాశి ఫలాలు


 వారఫలాలు. 

By Dr KUMAR, PhD

Astrologer & Numerologist

-----------------------------------------------

07th FEB 2021 నుండి 13th FEB 2021 వరకు


గమనిక

------------

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టిలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.


మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.


పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు,


మేషరాశి

------------

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి:-

ఈ వారం ఒక వివాదం నుంచి గట్టెక్కి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రయత్నాలు సఫలం కాగలవు. కళారంగం వారికి నూతనోత్సాహం. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశాజనకంగా ఉన్నా అవసరాలకు సొమ్ము సమకూరుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆలయాలు సందర్శనాలు అధికంగా చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. 


వృషభరాశి

----------------

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి:-

ఈ వారం వ్యాపారాలు గతం కంటే మెరుగుపడి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాల కృషి ఫలించే సూచనలు. ముఖ్యమైన పనులు చకచకా పూర్తి కాగలవు. సమాజంలో మీపట్ల ఆదరాభిమానాలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము సమయానికి అందుకుంటారు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. 


మిధునరాశి

----------------

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు లభిస్తాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు శుభవర్తమానాలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. అందరిలోనూ విశేష గౌరవం లభిస్తుంది. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు.


కర్కాటకరాశి

-----------------

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి:-

ఈ వారం కొన్ని స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు మరింత పెరుగుతాయి. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. శ్రమపడ్డా ఫలితం అంతగా కనిపించదు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. నిర్ణయాలలో తొందరపాటు తగదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. 


సింహరాశి 

--------------

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి:-

ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామికవర్గాలకు విజయాలు వరిస్తాయి. వీరికి పట్టింది బంగారమే. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాటసాయం అందుతుంది. అతిముఖ్యమైన పనులలో విజయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొన్ని ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి.


కన్యారాశి

--------------

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి:-

ఈ వారం గృహ నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. భూవివాదాలు కొంతమేర పరిష్కారమవుతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.


తులారాశి

-------------

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం ఆశయాలు సిద్ధిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు దక్కే సూచనలు. కళారంగం వారి యత్నాలు కొలిక్కి వస్తాయి. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. 


వృశ్చికరాశి

---------------

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి:-

ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో మరింత మెరుగుదల కనిపిస్తుంది. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. 


ధనుస్సురాశి

-----------------

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి:-

ఈ వారం వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గే సూచనలు. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు మరింత పెరుగుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. విద్యార్థులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ నిర్ణయాలు అందరూ ఆమోదిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. 


మకరరాశి

--------------

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి:-

ఈ వారం కొత్త వ్యక్తులతో పరిచయాలు.సేవాకార్యక్రమాలు చేపడతారు. కొన్ని అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు.పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సూచనలు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం ఉండవచ్చు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. 


కుంభరాశి

-------------

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి:-

ఈ వారం స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. నూతన వ్యవహారాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. 


మీనరాశి

-------------

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి:-

ఈ వారం స్థిరాస్తి విషయంలో చిక్కులు, సమస్యలు తీరతాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో అనుకోని బాధ్యతలు చేపడతారు. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుకుంటారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఆలోచనలు మరింత కలసివస్తాయి. విద్యార్థులకు సమస్యలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రాజకీయవర్గాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. 


గమనిక

---------------

మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి

కామెంట్‌లు