కృష్ణతేజ ఐ.ఏ.ఎస్ కు అభినందనలు

 

కరోనా మహమ్మారి కారణంగా కేరళ మరియు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ లో కేరళ లో ఒంటరిగా మిగిలిపోయిన విదేశీ  పర్యాటకులకు మంచి ఆతిథ్యం ఇచ్చి వారి  ప్రశంసలు అందుకున్న ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణ తేజ కు కేరళ ప్రభుత్వం, పర్యాటక శాఖ నుంచి ప్రశంసాపత్రం లభించింది. ఈ సందర్భంగా కృష్ణ తేజ మాట్లాడుతూ ఆదిథ్యం స్వీకరించిన అతిధులనుంచి కూడా తమకు, తమ అధికారులు, సిబ్బందికి సోషల్ మీడియా వేదికగా ఎన్నో ప్రశంసలు అందాయని సంతోషం వ్యక్తం చేశారు. పర్యాటక శాఖ లోని అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యం అయ్యిందని అన్నారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట పట్టణానికి చెందిన పలువురు పట్టణ ప్రముఖులు కృష్ణ తేజ ను ప్రత్యేకంగా అభినందించారు. ఇంతటి తెగువ జూపి అందరి ప్రశంసలను అందుకున్న కృష్ణతేజను తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నవి. 


కామెంట్‌లు