ఈ వారం రాశి ఫలాలు

 

వారఫలాలు. 

By Dr KUMAR, PhD

Astrologer & Numerologist

-----------------------------------------------

21st FEB 2021 నుండి 27th FEB 2021 వరకు



గమనిక

------------

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టిలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.


మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.


పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు,



మేషరాశి

------------

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి:-

ఈ వారం బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం. ఆర్థికంగా బలం చేకూరుతుంది. అనుకున్న పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. 


వృషభరాశి 

---------------

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి:-

ఈ వారం నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి నూతనోత్సాహం. ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడినా అధిగమించి ముందడుగు వేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. 


మిధునరాశి 

----------------

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి:

ఈ వారం వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి.  రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. సోదరులు, మిత్రుల చేయూతతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులను మెప్పిస్తాయి. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. 


కర్కాటకరాశి

-----------------

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి:-

ఈ వారం పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాల యత్నాలలో కదలికలు ఉంటాయి. అనారోగ్య సూచనలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. ఇంటి నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. 


సింహరాశి :

---------------

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి:-

ఈ వారం వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణయత్నాలలో పురోగతి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి. మీ ఆలోచనలకు మరింత పదును పెడతారు. సన్నిహితులతో విభేదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభకార్యాల చర్చలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి.


కన్యారాశి

-------------

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి:-

ఈ వారం వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు. రాజకీయవర్గాలకు ఒక కీలక సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. 


తులారాశి

-------------

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం ఆశయాలు సాధిస్తారు.  సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కొంత అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. 


వృశ్చికరాశి

----------------

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి:-

ఈ వారం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులు, బంధువులతో సత్సంబంధాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు ఉండవచ్చు. ముఖ్యమైన పనుల్లో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. కళారంగం వారికి నూతనోత్సాహం, కొత్త ఆశలు చిగురిస్తాయి. 


ధనుస్సురాశి

-----------------

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి:-

ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు సఫలమవుతాయి.  కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. పనుల్లో అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి అవసరాలు తీరతాయి. మీ ఆలోచనలు పదిమందితో పంచుకుంటారు. భూముల వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. 


మకరరాశి

-------------

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి:-

ఈ వారం కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది, కొంత జాగ్రత్త అవసరం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మోస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. పనులు ముందుకు సాగవు. తోబుట్టువులతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 


కుంభరాశి

--------------

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి:-

ఈ వారం ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. బంధువులతో తగాదా సూచనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. 


మీనరాశి

------------

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-

ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పేరు గడిస్తారు. రాజకీయవర్గాలకు మరింత ఆశాజనకంగా ఉంటుంది.  పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చాకచక్యంగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి.


గమనిక

---------------

మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి

కామెంట్‌లు