రామ మందిర నిర్మాణానికి అవోపా నాగర్ కర్నూల్ వారిచే 2 లక్షల విరాళం

 


జిల్లా అవోపా  నాగర్కర్నూల్ ఆధ్వర్యంలో శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణం జాతీయ స్వాభిమాన పునః ప్రతిష్ట కార్యక్రమానికి 201116 రెండు లక్షల ఒక వెయ్యి నూట పదహారు రూపాయల చెక్కును ట్రస్ట్ వారికి అందించడం జరిగింది స్థానిక మార్కెట్ యార్డ్ శివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అవోపా అధ్యక్షులు శ్రీ బిల్లకంటి  రవికుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లిపెద్ది శంకర్ గారు పోలా శ్రీధర్ యూనిట్ అధ్యక్షులు వాస రాఘవేందర్ స్వయం సేవక్ సంఘ్ శ్రీనివాస్ రెడ్డి గారు బంగారు శృతి గారు ఎక్స్ జడ్పిటిసి .కొండా   మన్నెమ్మ గారు ఎల్ లేని సుధాకర్ రావు కొల్లాపూర్ గారు సుబ్బారెడ్డి గారు యమ్ పాండు బూసి రెడ్డి సుధాకర్ రెడ్డి శివయ్య గౌడ్ వాస  పాండురంగయ్య మిర్యాల శ్రీనివాసులు జిల్లా ప్రధాన కార్యదర్శి కందికొండ శ్రీనివాస్ ఆర్థిక కార్యదర్శి ఇమ్మడి దేవేందర్  తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  విచ్చేసినటువంటి మల్లిపెద్ది శంకర్ గారు మాట్లాడుసభ్యులందరినీ ఏకం చేసి అవోపా సభ్యులందరం ఒకటేనని ఒక్కరోజులోనే జిల్లా అధ్యక్షుల పిలుపు మేరకు నిధి సమర్పణ కార్యక్రమం జరిగిందని  రాముని యొక్క గుడి కట్టడానికిమన తరానికి మాత్రమే ఈ అవకాశం దక్కిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిల్ల కంటి రవికుమార్ మాట్లాడుతూ రామజన్మభూమి నిధి సేకరణకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి శ్రీరాముని ప్రతిమను  అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు

కామెంట్‌లు