సంక్రాంతి గీతం

 చింతల శ్రీనివాస్ గారి సంక్రాంతి గీతం

అవోపా హైదరాబాద్ మహారథి శ్రీ రెనుకుంట్ల నమఃశివాయ గారి వినూత్నమైన ఆలోచనలోంచి పురుడుపోసుకున్న అతి మనోహరమైన ఆలోచన ఈ సంక్రాంతి సంబరాల గీతం. తెలుగు సంప్రదాయ బధ్ధమైన, అందరికి ప్రీతిపాత్రమైన సంక్రాంతి శోభలన్నింటిని ఏరి, కూర్చి ఒక మనోహర దృశ్య, శ్రవణ గీత మాలికను అల్లి, వీనుల విందు గా సంగీతాన్ని సమకూర్చి,  పసందైన వీడియో క్లిప్పులను జతచేసి అశేష వైశ్య ప్రజానీకం మెఛ్చిన, ఆదరించిన ఈ సంక్రాంతి గీతాన్ని రచించిన  ప్రపంచ అవార్డుల గ్రహీత కవిరత్న శ్రీ చింతల శ్రీనివాస్ గారికి ఈ గీతం వారి కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. సంక్రాంతి గీతాన్ని రచించడానికి పురికొల్పిన అధ్యక్షుడు శ్రీ నమఃశివాయ గారికి, ప్రోత్సహించిన వారి కార్యదర్శి రవి గుప్త గారికి, కోశాధికారి మాకం బద్రీనాథ్ మరియు అవోపా హైదరాబాద్ పూర్వాధ్యక్షుడు శ్రీ బిగినేపల్లి చక్రపాణిలకు,  కోర్ కమిటీ సభ్యులు, శ్రీ గంప నాగేశ్వర రావు గారికి, రాజేశ్వరరావు గారికి మరియు ఆఫీస్ బేరర్లు అందరికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ హృదయకపూర్వక అభినందనలు తెలియజేయు చున్నవి - నూక యాదగిరి టి అవోపా.

కామెంట్‌లు