నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_20, జనవరి , 2021_*                *_సౌమ్య వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. శత్రువులు మీపై విజయం సాధించలేరు. *_దుర్గాస్తుతి మంచిది._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

 మీ మీ రంగాల్లో  ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన పనులను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అనవసర ధన వ్యయం సూచితం. *_దైవారాధన మానవద్దు._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

 కీలక వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తే మంచిది. 

*_లలితా దేవి నామాన్ని స్మరించాలి._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన విజయాలు ఉన్నాయి. పట్టుదల, మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ముఖ్యమైన విషయాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి . అవసరానికి ఆడుకునేవారు ఉంటారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. మాట విలువను కాపాడుకోవాలి.  పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. వారాంతంలో లాభం ఉంటుంది.

  *_లక్ష్మి నృసింహ స్వామి ఆరాధన శుభప్రదం._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

 ఉద్యోగంలో అనుకూల ఫలితాలున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే మంచిది._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

 కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను కొన్నాళ్లు వాయిదా వేయడం మంచిది. స్థానచలన సూచనలున్నాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. *_శివపార్వతుల  సందర్శనం శుభఫలితాలనిస్తుంది._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

 వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో  అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే  వారున్నారు జాగ్రత్త. *_సాయిబాబా నామాన్ని జపించాలి._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. *_హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారం కలిగిస్తాయి. *_నవగ్రహ శ్లోకాలు పఠిస్తే అన్ని విధాలా మంచిది._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి.   ప్రయాణాల్లో జాగ్రత్త. 

*_గణపతి స్తోత్రం చదవితే మంచి జరుగుతుంది._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త మానసిక శక్తిని కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే మంచిది._*

🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

 కీలక వ్యవహారాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. *_సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే శుభదాయకం._*

 🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు