నివాళి

 

అవోపా కామారెడ్డి మరియు హైద్రాబాద్ గౌరవ సలహాదారులు, రిటైర్డ్ డివిజనల్ ఇంజనీర్, APSEB  శ్రీ K. హన్మంత రావు గారు అనారోగ్యంతో తేదీ 15.1.2021 ఉదయం కామినేని హాస్పిటల్ లో 6.28 గం.కు మరణించారు. వారు కామారెడ్డి లో, పెద్దపల్లి లో, వివిధ జిల్లాలలో మరియు హైదరాబాద్ లో వివిధ హోదాలలో విశేష సేవలు అందించారు. ఆయన ముక్కు సూటిగా, నిర్మొహమాటంగా , ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని , ప్రజలకు సేవలందించే వారు. ఎవ్వరికీ భయపడే వారు కారు." సత్యానికి అన్నీ లొంగ వలసిందే. ఏ శక్తికీ సత్యం లొంగదు " అనే మాటను ఆయన నమ్మి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆచరించారు. తెలంగాణ రాష్ట్ర అవోపా మతియు అవోపా న్యూస్ బులెటిన్ వారి ఆత్మశాంతి కై దేవుని ప్రార్థిస్తూ, వారి కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నవి.

- నిజాం వెంకటేశం,ADE రిటైర్డ్.

కామెంట్‌లు