జమ్మికుంట అవోపా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

 ఈ రోజు స్థానిక గీతమందిర్ కళ్యాణ మండపం లో జమ్మికుంట అవోపా మహాజనసభ నిర్వహించి కార్యవర్గానికి ఎన్నికలు జరుప నిశ్చయించి ఎన్నికల అధికారి గా శ్రీ కొండూరు శ్రీనివాస్ ను, సహాయ ఎన్నికల అధికారిగా ఈశ్వర ప్రసాద్, ఐతా సుధాకర్, డాక్టర్ ఎం.రాజేశ్వరయ్య గారలను అవోపా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీ పి.వి రామకృష్ణ గారు నియమించగా వారు ఎన్నికలు నిర్వహించి శ్రీ కె.ఆర్.వి.నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనారని ఎన్నికల అధికారి టీం ప్రకటించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగినది. ఇట్టి కార్యక్రమము లో జిల్లా అధ్యక్షులు. పీ వీ రామకృష్ణ ,జిల్లా ప్రధాన కార్యదర్శి కొండూరి.శ్రీనివాస్, ఏ. సుధాకర్ , రాష్ట్ర . నాయకులు ఎ. ఈశ్వర ప్రసాద్ డా. ముక్క రాజేశ్వరరావు , రావికంటి సురేందర్ బచ్చు రమేష్ తది తరులు పాల్గొన్నారు.  ఎన్నికైన కె ఆర్ వి నర్సయ్య మాట్లాడుతూ అవోపా ద్వారా వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు  గతంలో లాగానే నిర్వహిస్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి శ్రీ బాదం సురేష్ బాబు మాట్లాడుతూ నిరుపేద ఆర్య వైశ్యులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించగల మని తెలిపారు. ఆర్థిక కార్యదర్శి శ్రీ కొండ్ల నగేష్ , జిల్లా నాయకులు అక్కెపల్లి, శ్రీధర్ , కాశీ విశ్వనాథ్ రవికిరణ్, పవన్ , అక్కపల్లి శ్రీధర్ , మంచాల. రాంబాబు వైశ్య సంఘం డివిజన్ చైర్మన్ ఎ. రాజేంద్ర ప్రసాద్ ,వైశ్య ప్రముఖులు , ఇతరులు పాల్గొన్నారు

కామెంట్‌లు