ఈ వారం రాశి ఫలాలు

 

వారఫలాలు. 

By Dr KUMAR, PhD

Astrologer & Numerologist

-----------------------------------------------

31st JAN 2021 నుండి 06th FEB 2021 వరకు


గమనిక

------------

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టిలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.


మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.


పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు,


మేషరాశి

-------------

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి:-

ఈ వారం వ్యాపారాలు కొంత నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. కళారంగం వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తుల విషయంలో ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం. ఆరోగ్యపరంగా చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు  అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


వృషభరాశి

---------------

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి:-

ఈ వారం వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజకనంగా ఉంటాయి. ఊహించని ధనలాభాలు ఉండవచ్చు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.


మిధునరాశి 

-----------------

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. సోదరులు, మిత్రుల చేయూతతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. స్థిరాస్తి లాభం కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో నెలకొన్న సబ్దత తొలగుతుంది. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు.


కర్కాటకరాశి

-----------------

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి:-

ఈ వారం ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు పోటీపరీక్షల్లో విజయం. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారాలలో ఆటంకాలు తొలగి లాభాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


సింహరాశి 

--------------

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి:-

ఈ వారం వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి, అనుకోని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఈతిబాధలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పిలుపు అందుతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరమైన వ్యక్తులు దగ్గరవుతారు. 


కన్యారాశి

-------------

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి:-

ఈ వారం నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది. రాజకీయవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి సహాయం అందుతుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు.  వివాహయత్నాలు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.


తులారాశి

--------------

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో లాభాలకు లోటు ఉండదు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపడతాయి. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆరోగ్యసమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.


వృశ్చికరాశి

---------------

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి:-

ఈ వారం సంఘంలో మీపై మరింత ప్రేమ పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలలో అవాంతరాలు తొలగి ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో విశేష గౌరవం లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు అన్ని విధాలా కలసివచ్చే కాలం. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆప్తులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 


ధనుస్సురాశి

-----------------

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి:-

ఈ వారం ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం  ప్రారంభంలో స్వల్ప చికాకులు నెలకొంటాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు సఫలం. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, భాగస్వాములు సహకరిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది.


మకరరాశి

--------------

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి:-

ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు సానుకూలం. గృహ నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు . అనుకూలమైన శుభ ఫలితాల కొరకు  రావి చెట్టుకు 27 ప్రదక్షిణలు చేయండి.


కుంభరాశి

--------------

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి:-

ఈ వారం భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం, బాధ్యతలు కొంత తగ్గి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు  అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


మీనరాశి

-------------

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి:-

ఈ వారం భూవివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. సమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అవరోధాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనుకున్న లక్ష్యాల సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.

గమనిక

---------------

మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి

కామెంట్‌లు