నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_14, జనవరి , 2021_*                *_బృహస్పతి వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

 శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. *_శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్నినింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు  మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. *_కనకధారాస్తవం చదవాలి._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. 

*_ఆంజనేయ దర్శనం మంచిది._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

*_విష్ణు సహస్రనామం చదవాలి._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

అనుకూల సమయం. తోటి వారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. 

*_గణపతి ఆరాధన చేస్తే మంచిది._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానకండి. *_ఇష్టదైవ దర్శనం శుభప్రదం._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. *_ఇష్టదైవప్రార్థన చేస్తే మంచిది._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. *_లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

 ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. *_సూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకం._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

 శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. *_శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

చేపట్టే పనుల్లో గొప్పఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. *_విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది._*

🏺🏺🏺🏺🏺🏺🀊

🦈 *_మీనం_*

పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. *_శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం._*

 🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు