🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_12, జనవరి , 2021_* *_భౌమ వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
చేపట్టిన పనుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒక ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు. *_గురువుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోవద్దు. *_శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో శుభ ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. *_సాయి బాబా సందర్శనం శుభప్రదం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
కీలక విషయాల్లో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.
*_సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే మంచిది._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా దైవానుగ్రహంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. *_వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది. బుద్ధిబలంతో సమస్యలు తొలుగుతాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు.
*_విష్ణు సహస్రనామ స్తోత్రం చదవాలి._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధనధాన్య లాభాలుంటాయి. ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు. తోటి వారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
*_లక్ష్మీ నామాన్ని జపిస్తే ఉత్తమం._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ప్రయత్నకార్య సిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. విందు, వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు.
*_ఇష్టదైవ నామస్మరణ శుభాన్నిస్తుంది._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో మేలైన ఫలితాలున్నాయి. శత్రువులపై నైతిక విజయం సాధిస్తారు. ముఖ్య విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే వివాదాలు చుట్టుముడతాయి. ఎవ్వరినీ అతిగా నమ్మవద్దు.
*_శనికి తైలాభిషేకం చేస్తే శుభప్రదం._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
తలపెట్టిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రుల సహకారం మేలు చేస్తుంది. *_నవగ్రహ స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
మీలోని చిత్తశుద్ది మీ విజయానికి మూలమవుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఖర్చులు పెరగకుండా చూచుకోవాలి. విఘ్నాల్ని కలిగించేవారు పక్కనే ఉంటారు. *_ఆదిత్య హృదయం చదివితే శుభదాయకం._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
మీ మీ రంగాల్లో సమర్థవంతంగా ముందుకుసాగి విజయం సాధిస్తారు. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. *_సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం శుభప్రదం._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి