ఈ వారం రాశి ఫలాలు

 

వారఫలాలు. 

By Dr KUMAR, PhD

Astrologer & Numerologist

-----------------------------------------------

24th JAN 2021 నుండి 30th JAN 2021 వరకు


గమనిక

------------

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టిలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.


మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.


పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు,


మేషరాశి

------------

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి:-

ఈ వారం అనుకున్న పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


వృషభరాశి 

---------------

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి:-

ఈ వారం ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడినా అధిగమించి ముందడుగు వేస్తారు. ఆస్తుల విషయంలో సోదరులతో అవగాహనకు వస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి నూతనోత్సాహం.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.


మిధునరాశి

----------------

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. సోదరులు, మిత్రుల చేయూతతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. స్థిరాస్తి లాభం కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు.


కర్కాటకరాశి

-----------------

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి:-

ఈ వారం పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. ఇంటి నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. వివాహయత్నాలలో కొంత వెనుకబాటు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాల యత్నాలలో కదలికలు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


సింహరాశి :

----------------

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి:-

ఈ వారం ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి. మీ ఆలోచనలకు మరింత పదును పెడతారు. సన్నిహితులతో విభేదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభకార్యాల చర్చలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణయత్నాలలో పురోగతి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు  అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


కన్యారాశి

-------------

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి:-

ఈ వారం కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. కుటుంబంలో సంతోషకరమైన సమాచారం అందుతుంది. కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.


తులారాశి

--------------

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం ఆర్థికంగా బలం పుంజుకుంటారు. ఆశయాలు సాధిస్తారు. ఇంట్లో ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కొంత అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.


వృశ్చికరాశి

---------------

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి:-

ఈ వారం ముఖ్యమైన పనుల్లో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులు, బంధువులతో సత్సంబంధాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి నూతనోత్సాహం, కొత్త ఆశలు చిగురిస్తాయి. 


ధనుస్సురాశి

-----------------

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి:-

ఈ వారం పనుల్లో అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి అవసరాలు తీరతాయి. మీ ఆలోచనలు పదిమందితో పంచుకుంటారు. భూముల వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు సఫలమవుతాయి.  కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో అనుకున్న బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. 


మకరరాశి

--------------

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి:-

ఈ వారం ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. సోదరులతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది, కొంత జాగ్రత్త అవసరం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మోస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 27 ప్రదక్షిణలు చేయండి.


కుంభరాశి

--------------

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి:-

ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


మీనరాశి

-------------

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ వారం పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చాకచక్యంగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పేరు గడిస్తారు. రాజకీయవర్గాలకు మరింత ఆశాజనకంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.


గమనిక

---------------

మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి

కామెంట్‌లు