నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 

శుభమస్తు 👌 

19, జనవరి , 2021                భౌమ వాసరే

రాశి ఫలాలు 

 

🐐 మేషం

శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల విషయంలో అప్రమత్తత అవసరం. శివారాధన శుభప్రదం 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 వృషభం 

విజయమార్గంలో ముందుకు సాగుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్ట దైవారాధన శుభదాయకం 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 మిధునం

ముఖ్యమైన విషయాల్లో నిదానమే ప్రధానంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు వద్దు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవ నామాన్ని స్మరిస్తే మంచి జరుగుతుంది. 

💑💑💑💑💑💑💑


🦀 కర్కాటకం

సంతోషంగా కాలాన్ని గడుపుతారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది. 

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 సింహం

శుభవార్తలు వింటారు. మీ చుట్టూ ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. అనవసర విషయాల్లో మౌనం వహించడం మంచిది. బాధ్యతలను గుర్తెరిగి పనిచేస్తే శుభ ఫలితాలను పొందుతారు. శ్రీవిష్ణు సందర్శనం ఉత్తమం. 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 కన్య

ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది.  మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. లక్ష్మీదేవి సందర్శనం శుభ ఫలితాన్నిస్తుంది 

💃💃💃💃💃💃💃


⚖ తుల

ఈరోజు

మీ మీ రంగాల్లో అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో అభిప్రాయ భేదాలను రానీయకండి. బంధుమిత్రుల కారణంగా ధన వ్యయం జరుగుతుంది.  సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించాలి. 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 వృశ్చికం

ఉత్సాహంగా పనిచేయాలి. గొప్ప సంకల్పబలంతో తలపెట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం శుభ ఫలితాన్నిస్తుంది .

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 ధనుస్సు

శుభ కాలం. కొన్ని వ్యవహారాల్లో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. సకాలంలో సాయం  చేసేవారున్నారు. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. శివారాధన ఉత్తమం. 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 మకరం

మిశ్రమ కాలం. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఒత్తిడితో మనశ్శాంతి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. గోవింద నామాలు చదివితే శుభదాయకం.

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 కుంభం

శుభసమయం. పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. ధన, ధాన్య లాభాలున్నాయి. మనస్సౌఖ్యం కలదు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగితే శుభం జరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం 

🏺🏺🏺🏺🏺🏺


🦈 మీనం

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంటుంది. మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మహా గణపతి ఆరాధన శ్రేయోదాయకం 

 🦈🦈🦈🦈🦈

                                                                       సమస్తసన్మంగళాని భవన్తు,  👌 

                                                              ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌

 శుభపరంపరాప్రాప్తిరస్తు,👌

 ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌

                                లోకాసమస్తా సుఖినోభవంతు👌

                                    సర్వేజనాః సుఖినోభవ👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు