నేటి దినసరి రాశి ఫలితాలు


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_04, డిసెంబర్ , 2020_* *_భృగు వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. *_నవగ్రహ శ్లోకాన్ని పఠించాలి._* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


తలపెట్టిన కార్యాల్లో విఘ్నాలు ఎదురౌతాయి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహ పరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. *_లక్ష్మీ ఆరాధన, కనకధారాస్తవం పఠించాలి._*   


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


ప్రయత్న కార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం_* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


మంచిపనులు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్నిస్తాయి. *_గోవింద నామాలు పఠించడం మంచిది._* 


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్నిస్తాయి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి. *_దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది_*.


  🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలున్నాయి. *_ఇష్టదేవతా శ్లోకాలు చదివితే అంతా మంచి జరుగుతుంది._*     


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


శుభకాలం. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. *_శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది._*


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. *_నవగ్రహధ్యాన శ్లోకం చదివితే మంచిది._*  


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. *_ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది._* 


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


మంచి ఫలితాలున్నాయి. ఉత్సాహంగా పనిచేయాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శాంతి చేకూరుతుంది. *_రామ నామాన్ని స్మరించండి_*  


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


చేప్పట్టే పనుల్లో గొప్పఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. *_విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది._* .


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. *_శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం._*    


 🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు