నేటి వార ఫలాలు

 

Ph. No. 7036640949

Note : Please make calls between 10 Am ... 11 Am  or 04 Pm .... 06 Pm or 08 Pm ... 09 Pm, as I will be on  Online Services Work ..I may not Attend your call or My mobile may be in Switch Off mode..

వారఫలాలు

-------------------

13th Dec 2020. to. 19th Dec 2020 

గమనిక:- 

---------------

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టిలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.

....

మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

....

పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు.

@@@@


మేషరాశి (Aries) 

----------------------------

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- 

ఈ వారం వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. విద్యార్థుల్లో నైరాశ్యం తొలగుతుంది. సంఘంలో విశేష ఖ్యాతి పొందుతారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఆస్తుల విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు  అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి, 


వృషభరాశి ( Taurus) 

----------------------------------

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- 

ఈ వారం ఉద్యోగాలలో ఇబ్బందులు, అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చికాకులు, సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొత్త పదవులు దక్కే సూచనలు. పలుకుబడి మరింత పెంచుకుంటారు. హామీలు నిలుపుకునేందుకు కొంత శ్రమిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.


మిధునరాశి ( Gemini) 

----------------------------------

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారిక:-

ఈ వారం ఉద్యోగాయత్నాలు నిదానంగా సాగుతాయి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. మంచి విషయాలు చెప్పినా ఎదుటవారు అపార్థం చేసుకునే వీలున్నందున ఆచితూచి వ్యవహరించండి. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. అనుకున్న వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. పరిస్థితులు అనుకూలించవు. ఆస్తులు విషయంలో వివాదాలు తప్పకపోవచ్చు. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురుకావచ్చు.  గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు.


కర్కాటకరాశి ( Cancer) 

-------------------------------------

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ వారం కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమించి లాభాలబాటలో నడుస్తారు. పారిశ్రామికవర్గాలకు వ్యూహాలు ఫలిస్తాయి. పరిస్థితులను అనుకూలమైన రీతిలో మార్చుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. కుటుంబంలో మీమాటే అందరూ శిరసావహిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


సింహరాశి (Leo)

---------------------------

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు పొందుతారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. అత్యంత కీలక సమాచారం అందుతుంది. కొన్ని వివాదాల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు మెరుగుపడి ఊరట చెందుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. చాకచక్యంగా వ్యవహరించి కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారని ఎర్రని పూలతో పూజించండి.


కన్యారాశి ( Virgo) 

------------------------------

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 

ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా గందరగోళం తొలగుతుంది. రుణాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.


తులారాశి ( Libra) 

------------------------------

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 

ఈ వారం వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు గతం కంటే మరింత అనుకూలిస్తాయి. అనుకున్న వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు ప్రతిభను చాటుకునేందుకు తగిన సమయం. ఆస్తుల వ్యవహారాలలో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.


వృశ్చికరాశి ( Scorpio) 

---------------------------------------

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 

ఈ వారం  ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు. కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కొన్ని సమస్యలు ఎదురైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. పరిస్థితులు అనుకూలించి కాస్త ఊరట చెందుతారు. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. 


ధనుస్సురాశి ( Sagittarius) 

------------------------------------------

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- 

ఈ వారం ఉద్యోగాలలో మీ ఆశయాలు నెరవేరతాయి. రాజకీయవర్గాలకు అనుకూల వాతావరణం. కొన్ని పనులు అత్యంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారితో చర్చలు జరుపుతారు. భూములు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. కోర్టుల్లోని కొన్ని వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. 


మకరరాశి ( Capricorn) 

----------------------------------------

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 

ఈ వారం చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో సమస్యలు క్రమేపీ తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొన్ని అవాంతరాలు తొలగుతాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 21 ప్రదక్షిణలు చేయండి.


కుంభరాశి ( Aquarius) 

------------------------------------------

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం కొన్ని అంచనాలను నిజం చేసుకుంటారు. ఎటువంటి సమస్య ఎదురైనా పట్టుదలతో పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆస్తుల కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాల కృషి కొంత ఫలిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు  అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


మీనరాశి ( Pisces)

------------------------------

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- 

ఈ వారం వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. మీ సేవానిరతిని అందరూ ప్రశంసిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.

మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి





కామెంట్‌లు