ఈ వారం రాశి ఫలాలు

 

        

వారఫలాలు

By Dr KUMAR, PhD

Astrologer & Numerologist

Email : glowskin15@gmail.com

-----------------------------------------------

20th DEC 2020 నుండి 26th DEC 2020 వరకు

గమనిక

------------

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టిలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.

మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.

పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, 

వ్యక్తిగత సంప్రదింపుల కోసం ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు


మేషరాశి (Aries) 

--------------------------

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ వారం మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వేడుకలకు హాజరవుతారు. ప్రతికూలతలు తొలగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సన్నిహితుల సలహా పాటిస్తారు. 


వృషభరాశి ( Taurus)

-------------------------------

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ వారం కొత్త పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. బంధువర్గంతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు సంభవం. కళారంగం వారికి కార్యసిద్ధి. అనారోగ్యం, శ్రమాధిక్యం. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. 


మిధునరాశి ( Gemini)

---------------------------------

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు కొంత పెరుగుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు.


కర్కాటకరాశి ( Cancer) 

-------------------------------------

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ వారం పనులలో ఆటంకాలు తొలగి సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ప్రముఖుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు ముమ్మరం చేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ ఊహలు, అంచనాలు నిజం కాగలవు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


సింహరాశి (Leo) 

-------------------------

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :

ఈ వారం నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. విద్యార్థులకు గతం కంటే మెరుగైన పరిస్థితి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి, లాభాలు అనూహ్యంగా పెరుగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


కన్యారాశి ( Virgo) 

---------------------------

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ వారం ఉత్సాహంగా కార్యక్రమాలు కొన్ని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. విద్యార్థులు కొత్త కోర్సులు దక్కించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.


తులారాశి ( Libra) 

---------------------------

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం కొన్ని పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు నిదానిస్తాయి. ఎంత శ్రమించినా అనుకున్న ఫలితం కనిపించదు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. రాజకీయవర్గాలకు అంచనాలు తప్పుతాయి.శుభవార్తలు, ధన, వస్తులాభాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.


వృశ్చికరాశి ( Scorpio)

---------------------------------

 విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ వారం శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు, వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. కుటుంబానికి సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి అలాగే లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. 


ధనుస్సురాశి ( Sagittarius) 

----------------------------------------

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ వారం కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకోవడంలో ముందడుగు వేస్తారు. దైవకార్యాలలో పాల్గొంటారు. వివాహాది వేడుకలపై చర్చలు జరుపుతారు. వ్యాపారాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. అనారోగ్య సూచనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. .


మకరరాశి ( Capricorn) 

-----------------------------------

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ వారం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వ్యవహారాలు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు.ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో పూర్వవైభవం కనిపిస్తుంది. ఉద్యోగాలలో పైస్థాయి వారి నుంచి ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 27 ప్రదక్షిణలు చేయండి.


కుంభరాశి ( Aquarius) 

---------------------------------

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ వారం ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక విషయాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వాహన, గృహయోగాలు. యుక్తితో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు చిక్కులు తొలగుతాయి. ధనవ్యయం, శ్రమ మరింత పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


మీనరాశి ( Pisces) 

-----------------------------

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ వారం అనుకున్న వ్యవహారాలు మరింత విజయవంతంగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ముఖ్య విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులను సైతం చాకచక్యంగా మీదారికి తెచ్చుకుంటారు. ఆర్థికంగా మరింత బలపడతారు. రుణబాధలు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. అయితే, ఆరోగ్యవిషయంలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు చిక్కులు వీడతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.



గమనిక

---------------

మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి

కామెంట్‌లు