నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_14, డిసెంబర్ , 2020_* *_ఇందు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ఈరోజు

మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. *_గణపతి స్తోత్రం చదవండి._*  

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_*

ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. అనవసర కలహం సూచితం. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. *_శనిశ్లోకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి_* .  

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. *_ఆంజనేయ ఆరాధన శుభప్రదం._*   

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. *_ఆదిత్య హృదయం చదవాలి._*   

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

మనోధైర్యంతో ముందడుగు వేసి సత్పలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అయితే, వారివల్ల అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. *_కనకధారాస్తోత్రం చదివితే బాగుంటుంది_*  

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబసభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. *_గణపతి ఆరాధన శ్రేయోదాయకం_* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. *_సూర్యాష్టకం చదివితే బాగుంటుంది._* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. *_బిల్వాష్టకం చదివితే బాగుంటుంది._*    

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. *_దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి_* . 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. అష్టమ చంద్ర దోషం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మనోబలం కోసం దుర్గా *_అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది._*  

 🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లభిస్తుంది. *_వెంకటేశ్వరుడిని పూజిస్తే మంచిది._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్ధికలాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మసిద్ధి ఉంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. *_సంకటహర గణపతి స్తోత్రం చదివితే బాగుంటుంది_* .

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు