నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_24, డిసెంబర్ , 2020_* *_బృహసపతి వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

శ్రద్ధతో పనిచేయాలి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. 

*_సూర్యస్తుతి శక్తిని ఇస్తుంది._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_*

అనుకున్నది సాధించే దిశగా పయనిస్తారు. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఉత్తమం._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి. 

*_దుర్గాదేవి దర్శనం శుభప్రదం._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

 బుద్ధిబలంతో కొన్ని వ్యవహారాలలో సమస్యలను అధిగమించగలుగుతారు. మనఃసౌఖ్యం ఉంది. మనోల్లాసం కలిగించే ఘటనలు చోటుచేసుకుంటాయి. బంధువులతో వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. 

*_శివుణ్ణి ఆరాధిస్తే మంచిది._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

 ధర్మసిద్ధి కలదు. బుద్దిబలం బాగుంటుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. *_ఇష్ట దైవ దర్శనం శుభప్రదం._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

 కీలక సమయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో విజయం సాధించగలుగుతారు. బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. *_దశావతార స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

మనోధైర్యంతో చేసే పనులు సఫలం అవుతాయి. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. మీ మనసుపై ప్రభావం చూపేవారు ఉన్నారు. *_చంద్రశేఖరాష్టకం చదివితే మంచిది._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా మంచికాలం. అందరినీ కలుపుకొనిపోతే ఇబ్బంది ఉండదు.

 *_శివుడిని ఆరాధించాలి._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో మధ్యమ ఫలితాలు ఉన్నాయి. గిట్టని వారితో మిత భాషణం అవసరం. స్థాన చలనం సూచితం. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. *_ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

చేపట్టిన పనులలో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక విషయాలలో సమస్యలు తొలగి కుదురుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మాటను గౌరవిస్తే సమస్యలు తొలగుతాయి. *_హనుమత్ ఆరాధన శుభప్రదం._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. గిట్టని వారి జోలికి పోకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

 ప్రారంభించిన పనిలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. *_సంకటహర గణపతి స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు