నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_30, డిసెంబర్ , 2020_* *_సౌమ్య వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

శుభ సమయం. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. తృతీయంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తిప్రతిష్టల పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_దైవారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు_* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* ఈరోజు

మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యయంలో చంద్ర బలం అనుకూలంగా లేదు. మీ చుట్టూ గిట్టనివాళ్లు చేరి మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త. *_చంద్ర ధ్యానం శుభప్రదం._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

మొదలుపెట్టిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. *_శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభదాయకం_*.

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

ధర్మ సిద్ది ఉంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచి తూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. *_శివారాధన ఉత్తమం._* 

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

అనుకున్న సమయంలో లక్ష్యాన్ని చేరుకోడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. *_ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం._* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

నిర్ణీత కాలంలో పనులు పూర్తిచేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులుంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. అలసట లేకుండా చూసుకోవాలి. *_శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం._* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్త. కలహాలకు తావివ్వరాదు. *_శివారాధన ఉత్తమం_* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టులతో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. *_చంద్ర ధ్యానం శుభప్రదం_* .

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

ఈరోజు

మీ వినయ విధేయతలు మిమ్మల్ని రక్షిస్తాయి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్నవాళ్లు వ్యతిరేకంగా మారే అవకాశముంది. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. తోటి వ్యక్తులతో ఆచితూచి మాట్లాడాలి. *_అష్టలక్ష్మీ స్తోత్రం పఠిస్తే మంచిది._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్ర లాభాలున్నాయి. *_సూర్య నమస్కారాలు చేస్తే శుభం జరుగుతుంది._* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. *_విష్ణు ఆరాధనా శుభప్రదం_* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

మంచి పనులను మొదలుపెడతారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. *_గురు ధ్యానం చేస్తే మంచిది._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు