ఉప్పల కు వరంగల్ లో ఆత్మీయ సన్మానం
2020 డిసెంబర్ 18 న వరంగల్‌లోని ఆర్యవైశ్య సత్రం వద్ద ఐవిఎఫ్, అవోపా హనుమకొండ, వాసవి క్లబ్బులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ & ఇతర బిజినెస్ సంస్థలు మరియు విఐపిఎస్ చేత  టిఎస్ టూరిజం డెవలప్‌మెంట్ చైర్‌పర్సన్ శ్రీ ఉప్పల శ్రీవాస్‌కు ఐవిఎఫ్ నాయకుడు శ్రీ గట్టు మహేష్ బాబు అధ్యక్షతన సన్మానం జరిగింది. దీనికి ముఖ్య అతిథి గా టిఎస్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ బొల్లం సంపత్ గారు విచ్ఛేశారు. వక్తలుగా పోకల చందర్, తోట సంపత్ వరంగల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్  చైర్మన్ గోరంట్ల యాదగిరి, మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, కాసం నమహఃశివయ, ప్రసిద్ధ వస్త్ర వ్యాపారి పుల్లూరు వెంకట్, బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ మాదారపు రాజేశ్వర్, వరంగల్ పట్టణ వైశ్య సంగం,  మాజీ లా కాలేజీ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, మరియు ముఖ్య మయిన ఇతర వైశ్య బిజినెస్ నాయకులు అవోపా హనుమకొండ అధ్యక్షుడు ఎల్లేంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి ప్రకాష్ హాజరైనారు. ఆంధ్రప్రదేశ్ అవోపా పూర్వాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు,  లయన్స్ క్వెస్ట్ గవర్నర్ శ్రీ పోకల చందర్ గారు మాట్లాడుచూ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు తను కలిసి గత మూడు శతాబ్దాలుగా ఆర్యవైశ్య ప్రయోజిత కార్యక్రమాలలో పాలు పంచు కొంటున్నామని, వారు అలుపెరుగని ధీరో దాత్తుడని, ప్రజా సేవ చేయాలని కంకణం కట్టుకున్న వాడని, లాక్డౌన్ సమయంలో నిర్విరామంగా అన్నదానం మరియు నిత్యావసర  సరుకుల పంపిణీ నిర్వహించారని, ఉప్పల ఫౌండేషన్ ద్వారా వైశ్యులకే గాక వైశ్యేతరులకు కూడా తగు ఆర్థిక సహాయం చేయు చున్నారని తన ఆశు కవిత్వంతో శ్లాఘించారు. రాష్ట్ర ప్రభుత్వమొసంగిన ఈ పదవికి వీరు తగు న్యాయం చేయగలరని వీరిని హృదయ పూర్వకంగా అభినందించారు. పోకల గారి ప్రసంగాన్ని ఆద్యంతం సభికులు ఆసక్తి గా ఆలకించి హర్షద్వనాలు చేశారు. ముఖ్య   అతిథి శ్రీ బొల్లం సంపత్ గారు మాట్లాడుచూ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు నిర్విరామ కృషి చేయగల వారని వారు ప్రజలకు ఇతోధిక సేవచేయడానికి మంచి పదవిని కె.సి.ఆర్ గారు ఇచ్చారని ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మరియు ఉప్పల శ్రీనివాస్ గారికి అభినందనలు తెలిపారు. సభాధ్యక్షుడు శ్రీ గట్టు మహేష్ బాబు కూడా వారిని వేనోళ్ళ పొగుడుచూ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారిని అభినందించడానికి తరలి వచ్చిన అందరి ప్రముఖులకు, ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. చివరగా సన్మాన గ్రహీత శ్రీ ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుచూ వరంగల్ పట్టణం మంచి పర్యాటక ప్రదేశమని, కాకతీయ రాజులు నిర్మించిన వేయి స్తంభాల దేవాలయము,  వరంగల్ ఖిలా, రామప్ప దేవాలయము, పర్యాటక ప్రదేశాలైన పాఖాల, రామప్ప, లక్నవరం తటాకాలు పర్యాటకులకు కనువిందు కలుగజేస్తాయని, అలాంటి పర్యాటక ప్రదేశాలను తాను ప్రత్యేక శ్రద్ధ  తొ అభివృద్ధి చేయగలనని హామీ ఇచ్చారు. తనను అభినందించ తరలి వచ్చిన అందరి ప్రముఖులకు కృతజ్ఞతలు తెలుపుచూ, వరంగల్ ప్రముఖులు, వక్తలు తనకు చిర పరిచయులని, పోకల చందర్ గారు తెలిపిన విధంగా తాము కలసి ఎన్నో వేదికలు పంచుకున్నామని వారు మంచి వక్తే కాకుండా కవి మరియు వాగ్గేయ కారుడని, ఆర్య వైశ్య అభినవ గధ్ధర్ అని కొనియాడారు. భక్తుల సౌకర్యార్ధం భద్రకాళీ గుట్ట నుండి పద్మాక్షమ్మ గుట్టకు రోపువే ఏర్పాటు చేయగలనని తెలియ జేశారు. ఆర్య వైశ్య ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు గురించి మరియు 10% ఇ.డబ్ల్యు.ఎస్ రిజర్వేషన్ అమలు గురించి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా వున్నారని, అందులకు తాను కూడా ప్రయత్నిస్థానని తెలియజేశారు. 
    


కామెంట్‌లు