నేటి దినసరి రాశి ఫలితాలు


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_17, నవంబర్ , 2020_* *_భౌమ వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉంటారు. *_సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది._* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. *_శివనామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది._*    


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం._*  


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


శరీర సౌఖ్యం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. *_ఇష్టదేవతా శ్లోకాలు చదివితే మంచిది._* .   


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మానసిక సంతృప్తిని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. *_లక్ష్మీదేవి దర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి_*  


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. నిర్ణీత సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. *_ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం_* . 


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


ఈరోజు


మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది._* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. *_గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది_* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. *_సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది._* 


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాలని చూసే వారి ప్రయత్నాలు వృథా అవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. *_ఈశ్వర శ్లోకాలు చదవాలి._* 


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులను విషయాలను సాగదీయకుండా త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_ఆదిత్య హృదయం చదవడం మంచిది_*  


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


ప్రారంభించిన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. *_సాయి నామాన్ని జపించాలి._*  


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు