ప్రప్రథమంగా తెలంగాణ చరిత్రలో వైశ్య జాతికి... మహోజ్వల ఘట్టం... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్య వైశ్యులలో పేరొందిన ముగ్గురు ప్రముఖ సామాజిక కార్యకర్తలు వాసవి సేవా కేంద్రం శాశ్వత సలహాదారు, అనేక ధార్మిక సంస్థల సూత్రధారి శ్రీ బొగారపు దయానంద్ గారికి రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా, ప్రముఖ ప్రజ్ఞావంతుడు తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు శ్రీ అమరవాది లక్ష్మినారాయణ గారు రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు రాష్ట్ర టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా పదవులు పొందినందులకు తేది 25.11.2020 రోజున సాయంత్రం 7.00 నుండి 8.30 వరకు తాజ్ డెక్కన్, హైదరాబాద్ లో వర్చువల్ ముఖాముఖి మరియు "ఆత్మీయ సన్మాన కార్యక్రమం" అఖిల భారత అవోపాల ఫెడరేషన్ మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవోపా, హైదరాబాద్ అవోపా, Wam గ్లోబల్ లిటరరి ఫోరం, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్, ఫస్ట్ వైశ్య, అవోపా బ్యాంక్ మ్యాన్ చాప్టర్, వైస్ప్రా, వాసవి క్లబ్ హైదరాబాద్, అవోపానగర్ అమీన్పూర్ వారిచే సంయుక్తముగా ఏర్పాటు చేయనైనది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు శ్రీ బిగాల గణేష్ గుప్త గారు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొలేటి దామోదర్ గారు విచ్చేయు చున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్యులకు తెలంగాణ రాష్ట్రము నోసంగుచున్న మరియు నోసంగబోవు ప్రాయోజిత కార్యక్రమాల గురించి ముఖ్య అతిథులు విన్నవిన్చెదరు . మరియు జాతి ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి చేయవలసిన విన్నపాల గురించి కూడా వివరించెదరు. కావున అన్ని ఆర్య వైశ్యసంఘాల సభ్యులు, సలహా దారులు, కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు అందరూ ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొని ముక్తకంఠంతో మన నాయకులకు మన ఆర్య వైశ్యుల ఐక్యత సంఘీభావం తెలుపుతూ వారికి ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుదాం. సుమారు 500 మంది భారత దేశం లోని నలు మూలల నుండి ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొను చున్నారు కావున ముందుగా తమ తమ పేర్లనుఈ క్రింద పొందుపరచిన గూగుల్ ఫారం లో తగు వివరాలను నిక్షిప్త పరుస్తూ నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేయు చున్నాము. మరియు వర్చువల్ సమావేశంలో పాల్గొను వారు వారి పేరును కంప్యూటర్లో గాని, లాపుటాపు లో గాని, మొబైల్ లో గానీ మాకు కనబడు విధంగా ఐ.డి ని మార్చుకోవాలని, వారి ఫోటో ను మాత్రమే పంపాలని లేనిచో ఎవరు పాల్గొను చున్నారో తెలియని పరిస్థితి ఏర్పడి మిమ్ములను పిలిచే అవకాశం కోల్పోతారు అని తెలియ జేయు చున్నాము. ఈ మహత్తర అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని మన వైశ్య జాతి సమైక్యతను చాటి చెప్పాలని విన్నవించుకొను చున్నామని మరియు ఈ కార్యక్రమం అవోపా బ్యాంక్ మ్యాన్ చాపుటార్ వారి సౌజన్యం తో జరుగుచున్నదని అఖిల భారత అవోపాల ఫెడరేషన్ చైర్మన్ బెలిదే శ్రీధర్, ఆహ్వాన కమిటీ చైర్మన్ చింతల శ్రీనివాస్ విజ్ఞప్తి చేయుచున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి