అత్యుత్తమ శాస్త్రవేత్త ఓయూ ప్రొఫెసర్ రవీందర్ కు అభినందనలు


ఉస్మానియా యూనివర్సిటీ లోని ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ దాచేపల్లి రవీందర్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించారు. భారతీయ శాస్త్రవేత్తల్లో అత్యుత్తమస్థాయి కలిగిన రెండు శాతం మందిని ఎంపికచేయగా, ఇందులో రవీందర్ కు చోటు దక్కింది. అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డ్ వర్సిటీ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, విద్యా పరిశోధన అంశాల్లో సర్వే చేపట్టి, ప్రతిభ ఆధారంగా ఈ ఎంపికను చేపట్టారు. ఫిజిక్స్ విభాగంలోని మెటీరియల్ సైన్స్ నానో టెక్నాలజీ రంగాల్లో ఆయన ఈ జాబితాలో చోటు సంపాదించారు. గతంలో ఆయన యూజీసీ కెరీర్ అవార్డును పొందారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో రవీందర్ చేసిన సేవలకు 1996లో మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం చేతుల మీదుగా యంగ్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ శాస్త్రసాంకే   తికశాఖ  అందించే బాయ్స్ కాస్ట్ ఫెలోషిప్, ఇంగ్లాండ్ నుంచి రాయల్ సొసైటీ ఫెలో షిప్, జపాన్ నుంచి జేఎస్ ఎస్ ఫెలోషిప్ పొందారు. 31 ఏండ్లు ఓయూలో అధ్యాపకుడిగా పనిచేసి గత జూన్లో పదవీవిరమణ పొందారు. వీరిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు   అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి


కామెంట్‌లు