ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం కేంద్ర కమిటీ ఎన్నికలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు రెండవ సారి ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వీరు తెలంగాణ రాష్ట్ర అవోపాా లో గతంలో కార్యదర్శి గా పనిచేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు పోకల చందర్, విశ్రాంత మెట్రో వాటర్ వర్క్స్ డైరెక్టర్ శ్రీ మునుగోటి సత్యనారాయణ, అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూక యాదగిరి, పోల శ్రీధర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీమతి నాగ పద్మజ, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ బాలకృష్ణ పలువురు జిల్లా అధికారులు మరియు జిల్లా పరిధిలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాటిని ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పడం జరిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి