నేటి దినసరి రాశి ఫలితాలు


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_29, నవంబర్ , 2020_* *_భాను వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


ముందుచూపుతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. కీలక పనులను ప్రారంభించే ముందు సాధక బాధకాలను అంచనా వేసి ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. *_శివారాధన శుభప్రదం._*   


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర,ధాన్య లాభాలు ఉన్నాయి. *_దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది._* 


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కలహ సూచన ఉంది. *_గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు._* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. *_వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది._*  


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. *_శ్రీవారి దర్శనం శుభప్రదం._*  


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


కుటుంబసభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. స్వల్ప ధనలాభం, మనఃసంతోషం కలుగుతాయి. అదృష్ట యోగం ఉంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. *_అష్టలక్ష్మి స్తుతి మంచిది._*  


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


కీలక వ్యవహారాల్లో శ్రద్ధగా ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. *_నవగ్రహ స్తోత్రం చదవడం మంచిది._* 


 ⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. కీలక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. *_సాయిబాబా నామాన్ని జపించడం ఉత్తమం._* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. *_శని శ్లోకం చదవాలి._*  


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. *_లక్ష్మీధ్యానం వల్ల మంచి జరుగుతుంది_* .    


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. *_సూర్యాష్టకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి._* 


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాలని చూసేవారి ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసలే అవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. *_లింగాష్టకం చదవాలి._*


 🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు