నేటి దినసరి రాశి ఫలితాలు


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_12, నవంబర్ , 2020_* *_బృహస్పతి వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


అవసరానికి తగిన సహాయం అందుతుంది. కుటుంబసభ్యుల మాటకు ఎదురు మాట్లాడవద్దు. అందరినీ కలుపుకొనిపోతే త్వరగా విజయాన్ని అందుకుంటారు. మంచి భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవ నామస్మరణ శక్తిని ఇస్తుంది._* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


శుభ ఫలితాలు ఉంటాయి. ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొంటారు. *_ఆదిత్య హృదయం చదవాలి._*    


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్నిఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. *_శని శ్లోకం చదివితే బాగుంటుంది._* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


తలపెట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్దితో వ్యవహరిస్తారు. *_ఈశ్వర ధ్యాన శ్లోకం చదివితే బాగుంటుంది_*  


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. *_ఈశ్వర దర్శనం ఉత్తమం._*  


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


మంచి కాలం. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక కీలక విషయంలో మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభ కాలం. *_దుర్గాదేవి దర్శనం భప్రదం._*  


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


మిశ్రమకాలం. అప్పగించిన పనుల్లో చురుగ్గా పాల్గొనటం ద్వారా పనులు త్వరగా పూర్తవుతాయి. వృథా ప్రసంగాలతో లేనిపోని తలనొప్పులు వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి జరుగుతుంది._* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్నిఇస్తాయి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. *_ఉమా మహేశ్వర స్తోత్రం చదివితే మంచిది._* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబం సహకారం ఉంటుంది. *_దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది._*       


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. *_లక్ష్మీదేవి దర్శనం వల్ల శుభఫలితాలు కలుగుతాయి_* .


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


శుభ ఫలితాలు ఉన్నాయి. కాలం సహకరిస్తుంది. మీ మీ రంగాలలో విజయం సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటారు. *_ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది_*    


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. కొందరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. *_దుర్గాదేవి దర్శనం శుభప్రదం_* .


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు