ఈ వారం రాశి ఫలితాలు


వారఫలాలు


15th Nov 2020 నుండి 21st Nov 2020 వరకు


గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలన, జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి, మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. 


 


 


మేషరాశి (Aries) 


అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-


ఈ వారం విద్యార్థుల ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రగతి కనిపిస్తుంది. అనుకున్న విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తూ ముందుకు సాగుతారు. ఊహించని సంఘటనలు కొన్ని మార్పులు తేవచ్చు. పరిస్థితులు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. 


 


 


వృషభరాశి ( Taurus) 


కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :-


ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగలాభ సూచనలు. ఆర్థిక పరిస్థితి క్రమేపీ అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. కృషి, పట్టుదలతో కార్యసాధకులుగా నిలుస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. రాజకీయవర్గాలకు చిక్కులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. 


 


 


మిధునరాశి ( Gemini) 


మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-


ఈ వారం ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశాజనకంగా ఉండి అప్పుల కోసం యత్నిస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపారాలు అంతంత మాత్రంగా కొనసాగి నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో సామాన్యస్థితి. కళారంగం వారు అవకాశాలు చేజార్చుకుంటారు. ఏ పని చేపట్టినా మందకొడిగా సాగుతుంది. బంధువులు, మిత్రుల నుంచి కొన్ని వివాదాలు ఎదురయ్యే సూచనలు. నిరుద్యోగులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 


 


కర్కాటకరాశి ( Cancer) 


పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :-


ఈ వారం మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు స్వాగతిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరించి ముందడుగు వేస్తారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. కొన్ని కార్యక్రమాలు శ్రమలేకుండానే పూర్తి చేస్తారు. ఆందరి ఆప్యాయత, అనురాగాలు పొందుతారు. యుక్తి, నేర్పుతో కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త పుంజుకుంటుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. ఒక సమాచారం మీలో కొంత మార్పు తేవచ్చు. 


 


సింహరాశి (Leo) 


మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-


ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన అవకాశాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. పలుకుబడి, హోదాలు కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో కొనసాగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఒడ్డున పడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. 


 


కన్యారాశి ( Virgo) 


ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :-


ఈ వారం ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి లబ్ధి చేకూరుతుంది. గృహ, వాహనయోగాలు కలుగుతాయి. పలుకుబడి కలిగిన వారు పరిచయమై సహకరిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి. 


 


తులారాశి ( Libra) 


చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :-


ఈ వారం వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు లభిస్తాయి. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు, అనుకోని ధనవ్యయం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో బంధువుల సాయం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడి అవసరాలు తీరతాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.


 


వృశ్చికరాశి ( Scorpio) 


విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :-


ఈ వారం ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటుంది. క్రమేపీ పరిస్థితులు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. గోమాతకు గ్రాసం పెట్టండి.


 


ధనుస్సురాశి ( Saggittarius) 


మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-


ఈ వారం ప్రముఖ వ్యక్తులు పరిచయమై ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.అనుకున్న పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. 


 


మకరరాశి ( Capricorn) 


ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :-


ఈ వారం వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా మారతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల స్థితి. కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 27 ప్రదక్షిణలు చేయండo.


 


కుంభరాశి ( Aquarius) 


ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-


ఈ వారం ఉద్యోగాలలో మార్పులు కళారంగం వారికి కార్యసిద్ధి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. కొన్ని ఇబ్బందులు, సమస్యల నుంచి గట్టెక్కి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణబాధలు తొలగుతాయి. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. పొరపాట్లు సరిదిద్దుకుని కొత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు.


 


మీనరాశి ( Pisces) 


పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-


నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల సహకారంతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు వీడతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యూహాలతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.


మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి


కామెంట్‌లు