అవోపా హబ్సిగూడా వారి వర్చ్యువల్ కార్యవర్గ సమావేశం


      అవోపా హబ్సిగూడా కార్యవర్గ సమావేశం తేదీ 22.11.2020 రోజున సాయంత్రం 5 గంటలకు JIO meet అనువర్తనం ద్వారా నిర్వహించ బడింది. శ్రీ ఆర్. శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ వర్చ్యువల్ కార్యవర్గ సమావేశంలో 10 మంది కార్యవర్గ సభ్యులు, సలహాదారులు పాల్గొన్నారు. 


       తొలుత అధ్యక్షుడు శ్రీ ఆర్.శివకుమార్ గారు  స్వాగతోపన్యాసం చేసి అందులో అవోపా హబ్సిగూడా లెక్కలు సంస్థ ఆడిటర్ గారైన శ్రీ గుండ్ల కృష్ణయ్య గారిచే ఆడిట్ చేయబడినాయని తెలియజేయగా సభ్యులు కరతాల ధ్వనుల ద్వారా తమ సంతోషం తెలియజేశారు. తర్వాత 1995-96 లో అవోపా అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీ. సి.ఆర్.పి.శెట్టి గారు తేదీ 24.8.2020 రోజున పరమపదించినారని తెలుపగా వారి ఆత్మ శివైఖ్య మొందాలని అందరూ నివాళులు అర్పిస్తూ 2 నిమిషాల మౌనం పాటించారు. ప్రతి ఏటా జరుపు కార్తీక వనభోజనాల కార్యక్రమము కోవిద్19 కారణంగా జరుపగూడదని నిర్ణయించారు.  అధ్యక్షుడు  మాట్లాడుచూ తాను దిల్సుఖ్ నగర్లో ఒక పేద ఆర్యవైశ్య కుటుంబాన్ని గుర్తించానని వారికి నిత్యావసర సరుకులు ఇతర కార్యవర్గ సభ్యుల చందాల సహకారంతో త్వరలో పంపిణీ చేయ దలచానని తెలుపగా అందరూ తమ ఆమోదం తెలిపారు. ఈ కోవిద్ వైరస్ కారణంగా పలు భౌతికంగా కలియు కార్యక్రమాలు సంస్థ చేయలేక పోవుచున్నదని కూడా అధ్యక్షుడు తెలియ జేశారు. 


      అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్, అఖిల భారత అవోపాల రాష్ట్ర సమన్వయకర్త, అవోపా హైదరాబాద్ మరియు హబ్సిగూడ అవోపాల సలహాదారు శ్రీ నూకా యాదగిరి గారు మాట్లాడుచూ ప్రతీ అవోపా తమతమ రిజిస్టర్డ్ బైలాల ప్రకారం నడచు కోవాలనీ, ప్రతి కార్యవర్గ సమావేశంలో కార్యదర్శి తన కార్యకలాపాల నివేదికను తప్పని సరిగా సమర్పించి వారు చేసిన కార్యక్రమాల గురించి సభ్యులకు తెలియజేయాలని, అదే విధంగా ఆర్థిక కార్యదర్శి కూడా సమావేశాల మధ్య కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు కమిటీకి తెలియజేసి వారి ఆమోదం పొందాలని, ఆడిట్ గారి పరిశీలనాంశాలు, నివేదికలు కమీటీ సభ్యులకు తెలియజేసి వారి ఆమోదం పొందాలని, తదుపరి సర్వసభ్య సమావేశంలో ఆమోదమునకు సమర్పించాలని తెలియజేశారు. మరియొక సలహాదారు శ్రీ మద్ది హనుమంతరావు గారు మాట్లాడుచూ ప్రతి కార్యవర్గ సమావేశంలో మొదటి అజెండాగా గత సమావేశపు తీర్మాణాలు చదివి వినిపించి సభ్యుల ఆమోదం పొందాలని సూచించారు. చివరలో కార్యదర్శి గారి అభినందనలు వోట్ ఆఫ్ థాంక్స్ తో సమావేశం ముగించడమైనది. 


     ప్రతి అవోపా కూడా బైలాల నిబంధనల ప్రకారం ప్రతి మూడు మాసముల కొకమారు ఇ.సి మీటింగ్, సంవత్సరం లో కనీసం ఒక మారైనా మహాజనసభ జరుపు కోవాలని, కోవిద్ కారణంగా వర్చువల్ అనువర్తనం ద్వారా నైనా బైలాల నిబంధనల ప్రకారం  సమావేశాలు జరుపుకోవాలని, ఏ పరిస్థితుల్లో నైనా బైలాల కు విరుద్ధంగా నడచుకో కూడదని తెలంగాణ రాష్ట్ర అవోపా ఉద్బోధిస్తున్నది. 


 


 


 


 


 


 


కామెంట్‌లు