వారఫలాలు
8 nov 2020 నుండి 14 th nov 2020 వరకు
......
ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత గోచార గ్రహస్థితి, ద్వాదశ ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.
మేష రాశి
అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం యుక్తి, సమర్థతతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. కళారంగం వారికి కొంత ఊరట లభించే సమయం. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగుల ఉద్యోగయత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. పెండింగ్ బాకీలు వసూలై అవసరాలు తీరతాయి.
వృషభ రాశి
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :-
ఈ వారం నిరుద్యోగులు, విద్యార్థులకు నూతనోత్సాహం. ఒక సమాచారంతో మరింత ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలను , పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.
మిథున రాశి
మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-
ఈ వారం ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి తొలగుతుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడుల నుంచి విముక్తి. వ్యాపారాలు మరింత పురోగతిలో సాగుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొంటారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు.
కర్కాటక రాశి
పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :-
ఈ వారం ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రశంసలు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తినిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. సన్నిహితులతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. విస్తరణ కార్యక్రమాలను ముమ్మరం చేస్తారు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు.
సింహరాశి
మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై చర్చిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కళారంగం వారి కృషి కొంతమేర ఫలిస్తుంది.
కన్యారాశి
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :-
ఈ వారం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు గతం కంటే లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు, ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. కొత్త పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము సమయానికి అంది అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో విశేష గౌరవం. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి,
తులా రాశి:
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :-
ఈ వారం రాజకీయవర్గాలకు కొన్ని ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం.
వృశ్చికరాశి
విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :-
ఈ వారం వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికరంగం వారి కృషి కొంత ఫలిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో మీరంటే అంతా ఇష్టపడతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు.
ధనుస్సురాశి
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-
ఈ వారం వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. కళారంగం వారికి కార్యసిద్ధి. గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరతాయి. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. రుణబాధలు తీరతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలను కొలిక్కి తెచ్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది.
మకరరాశి
ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :-
ఈ వారం వ్యాపారాలు లాభిస్తాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం అందుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మిత్రులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 27 ప్రదక్షిణలు చేయండి.
కుంభరాశి
ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలలో చికాకులు తొలగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం నుంచి కొంత విముక్తి. పారిశ్రామికరంగం వారికి శ్రమ ఫలిస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు.
మీన రాశి
పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-
ఈ వారం వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొంత ఊరట లభించే సమయం. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులకు శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.
నోటు : ఈ వారం మంచి ఫలితాల కోసం అందరూ గణేశ మరియు దుర్గకు అర్చన చేయాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి